Redmi Note 15 Pro : కొత్త రెడ్మి ఫోన్లు చూశారా? 200MP కెమెరాతో రెడ్మి నోట్ 15 ప్రో సిరీస్ అదుర్స్.. అమెజాన్‌లో ప్రీ-బుకింగ్ ఆఫర్లు!
Redmi Note 15 Pro : రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్, రెడ్మి నోట్ 15 ప్రో సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 200MP మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Redmi Note 15 Pro
- రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
- రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్ 200MP మెయిన్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్
- 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,580mAh బ్యాటరీ ఆప్షన్
- 3 స్టోరేజ్ వేరియంట్లలో రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్
Redmi Note 15 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్మి లవర్స్ కోసం రెండు అద్భుతమైన ఫోన్లు వచ్చేశాయి. రెడ్మి నోట్ 15 తర్వాత షావోమీ సబ్-బ్రాండ్ రెడ్మి నోట్ 15 ప్రో, రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ రెండు ఫోన్లు గత మోడళ్లతో పోలిస్తే భారీగా ధర తగ్గాయి. 200MP మెయిన్ కెమెరా, 6,000mAh కన్నా బ్యాటరీ పవర్ ఆప్షన్, అమోల్డ్ బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. అమెజాన్‌లో ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ధర, స్పెషిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి.
రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్ 6.83-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో 1.5K రిజల్యూషన్ 120hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్, HDR10 ప్లస్ కూడా సపోర్టు ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 నుంచ ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఈ రెడ్మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది. 6,500mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్ 200MP మెయిన్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. బ్లూటూత్ 5.4, NFC, IR బ్లాస్టర్ IP66, IP68, IP69, IP69K రేటింగ్ కూడా అందిస్తుంది.
రెడ్మి నోట్ 15 ప్రో స్పెసిఫికేషన్లు :
రెడ్మి నోట్ 15 ప్రో కూడా అదే డిస్ప్లే స్పెసిఫికేషన్లతో రానుంది. 6.83-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 740అల్ట్రా చిప్సెట్ అందిస్తుంది.
45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,580mAh బ్యాటరీని అందిస్తుంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్ అందిస్తుంది. కెమెరా సెటప్ OIS, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో 200MP మెయిన్ సెన్సార్, ప్రో ప్లస్ అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 20MP సెన్సార్‌తో వస్తుంది.
భారత మార్కెట్లో రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్, నోట్ 15 ప్రో ధర, ఆఫర్లు
రెడ్మి నోట్ 15 ప్రో ప్లస్ 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
- 8GB + 256GB: రూ. 37,999
- 12GB + 256GB: రూ. 39,999
- 12GB + 512GB: రూ. 43,999
ఎంపిక చేసిన కార్డులపై కస్టమర్లు రూ.3వేల బ్యాంక్ డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రీ-బుకింగ్‌పై ఫ్రీ వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ సహా కస్టమర్లు రూ.4,999 వరకు ఆఫర్లను పొందవచ్చు. రెడ్మి నోట్ 15 ప్రో 8GB + 128GB వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ.31,999కు లభిస్తోంది.
రూ.3వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్లను పొందవచ్చు. రెడ్మి నోట్ 15 ప్రో కొనుగోలుపై రూ.2,499 వరకు ప్రీ-బుకింగ్ ఆఫర్లు పొందవచ్చు. వచ్చే ఫిబ్రవరి 4 నుంచి mi.com, amazon.in అధికారిక వెబ్సైట్లలో రెడ్ మి నోట్ 15 ప్రో సిరీస్ అందుబాటులో ఉంటుంది.
