Redmi Note 17 Pro : సూపర్ ఫోన్ భయ్యా.. రెడ్‌మి నోట్ 17 ప్రో ఆగయా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..
Redmi Note 17 Pro : ప్రపంచ మార్కెట్లోకి రెడ్‌మి నోట్ 4 ప్రో అడుగుపెట్టింది. 50ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో పాటు ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
- Sreehari A
- Published on- August 28, 2026 / 10:10 PM IST
Redmi Note 17 Pro
- రెడ్‌మి నోట్ 4 ప్రో గ్లోబల్ మార్కెట్లో లాంచ్
- స్నాప్‌డ్రాగన్ 17s జెన్ 6s చిప్‌సెట్
- ఈ ఫోన్ హైపర్ఓఎస్ 3 తో వస్తుంది
- భారీ 8,340mAh బ్యాటరీ సెటప్
Redmi Note 17 Pro : కొత్త రెడ్‌మి ఫోన్ కావాలా? గ్లోబల్ మార్కెట్‌లోకి కొత్త రెడ్‌మి నోట్ 17 ప్రో వచ్చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను మెయిన్ అప్‌గ్రేడ్‌లతో రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో భారీ 6.83-అంగుళాల OLED డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.
3500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ స్క్రీన్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. కంపెనీ స్కై బ్లూ, శాటిన్ ఆరెంజ్, పర్పుల్ బ్లాక్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..
ధర ఎంతంటే? :
కంపెనీ రెడ్‌మి నోట్ 17 ప్రోను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర 400 డాలర్లు (దాదాపు రూ. 38వేలు). కంపెనీ స్కై బ్లూ, శాటిన్ ఆరెంజ్, పర్పుల్ బ్లాక్ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి నోట్ 17 ప్రో ఫోన్ 1280×2772 పిక్సెల్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల OLED ప్యానెల్‌తో వస్తుంది. 12-బిట్ కలర్ 3500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్ అమర్చారు. 512GB వరకు UFS 3.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ప్రీ ఇన్‌స్టాల్ హైపర్‌ఓఎస్3తో వస్తుంది. కంపెనీ 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.
రెడ్‌మి నోట్ 17 ప్రో కెమెరా విషయానికి వస్తే.. OISతో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఇందులో 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో 8,340mAh సామర్థ్యంతో భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. కంపెనీ ప్రకారం.. 28 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. ఈ ఫోన్ 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు డాల్బీ అట్మోస్ ఆప్షన్లు ఉన్నాయి. 300శాతం వాల్యూమ్ బూస్ట్‌కు సపోర్టు ఇస్తాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.1 సపోర్టు ఉంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 IP68 రేటింగ్ అందిస్తుంది. 3 మీటర్ల లోతు వాటర్ కూడా తట్టుకోగలదు. ఈ ఫోన్ కొలతలు 164 x 75.4 x 7.9mm ఉండగా, బరువు 183.7 గ్రాములు ఉంటుంది.
