Reliance Jio 5G Data Plan Launched in India _ Price And Other Details
Jio 5G Data Plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ కస్టమర్ల కోసం 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో 5G యూజర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరకే రూ. 61 డేటా ప్లాన్‌ను ప్రకటించింది. జియో తమ My Jio యాప్‌లో కొత్త 5G అప్‌గ్రేడ్ సెక్షన్ యాడ్ చేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న రూ.61 డేటా వోచర్ ప్లాన్ కూడా ఉంది. అధిక ధర ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం లేని యూజర్లు తమ ఫోన్‌లలో 5Gని యాక్సెస్ చేసేందుకు ఈ ప్యాక్‌ని కొనుగోలు చేయొచ్చు.
రూ. 239 ప్రీపెయిడ్ ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రిలయన్స్ జియో కస్టమర్‌లు అదనపు ప్యాక్‌ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ధర ప్లాన్‌ని కలిగి ఉన్న యూజర్లు 5Gని యాక్సస్ చేయలేరని గమనించాలి. అలాంటి జియో యూజర్ల కోసం ఇప్పుడు కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో రూ. 61 ప్రీపెయిడ్ ప్యాక్‌ని యాడ్ చేసింది. 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న భారతీయ నగరాల్లో 5G సర్వీసులను యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇందులో 6GB డేటా కూడా ఉంటుంది.
మీ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసే వరకు రూ.61 ప్లాన్ యాక్టివ్‌గా ఉంటుంది. రూ.119, రూ.149, రూ.179, రూ.199 లేదా రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ 5G డేటా ప్లాన్ పని చేస్తుంది. మీరు Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ని అందుకోలేదా? అయితే ఈ 5G డేటా ప్లాన్ కొనుగోలు చేసినా 5G సర్వీసులను పొందలేరు. 5G సర్వీసులను యాక్సెస్ చేసేందుకు మరో 4 విషయాలు తప్పక గుర్తించుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేసేలా ఉండాలి. జియో నుంచి 5G సపోర్ట్ అప్‌డేట్ పొంది ఉండాలి.
Reliance Jio 5G Data Plan Launched in India
మీ డివైజ్ Reliance Jio 5G వెల్‌కమ్ స్వీకరించిన తర్వాత.. మీ డివైజ్ మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్ 5Gకి సెట్ చేయాలి. కంపెనీ MyJio యాప్‌లో 5G వెల్‌కమ్ కోసం చెక్ చేయవచ్చు. మీకు జియో 5G వెల్‌కమ్ సంబంధించిన కొన్ని నోటిఫికేషన్‌లను ఆటోమాటిక్‌గా పంపుతుంది మీ డివైజ్‌కు ఆహ్వానం అందిందని మీకు తెలియాలంటే MyJio యాప్ మెయిన్ పేజీలో బ్యానర్ ఉంటుంది. 5G నెట్‌వర్క్ యూజర్లకు 10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. నెట్‌వర్క్‌ని టెస్టింగ్ చేసిన వారికి చాలా వేగంగా డేటా అయిపోతుందని గమనించాలి.
మీ స్మార్ట్‌ఫోన్‌లో 5Gకి యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే, యాక్టివేట్ చేసిన తర్వాత, మీ డేటా కొద్దిసేపటిలో అయిపోతుంది. కొంతమంది నెట్‌వర్క్ సమస్యలను కూడా వస్తున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు 5Gని ఉపయోగించాలని ప్లాన్ చేస్తే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా ఉండదు. మీరు బయట ఉన్నప్పుడు ఇలా చేయకపోవడమే మేలు. ఫుడ్ కోసం ఆర్డర్ చేయడం నుంచి క్యాబ్‌లను బుక్ చేసుకోవడం వరకు ఈ రోజుల్లో డేటా చాలా ముఖ్యమైనది. Jio వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా Jio గరిష్టంగా 1Gbps స్పీడ్ డేటాను అందిస్తుంది, అయితే, లేటెస్ట్ నెట్‌వర్క్‌ను టెస్టింగ్ చేయడానికి అదనపు డేటాను ఉచితంగా అందించదు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..