రిలయన్స్ జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. జియో పే వాడుతున్నారా? భారతదేశంలో జియో ఫోన్ యూజర్ల కోసం 4G-ఓన్లీ టెల్కో రిలయన్స్ జియో డిజిటల్ చెల్లింపుల యాప్ కోసం జియో పే రిలీజ్ చేసినట్టు నివేదిక పేర్కొంది.
టెల్కో డిజిటల్ చెల్లింపుల యాప్‌ను భారతదేశంలోని జియో ఫోన్ యూజర్లకు అందుబాటులో తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. పేమెంట్స్ యాప్‌ను జియో ఫోన్ యూజర్లుకు దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
ఈ యాప్ టెస్టింగ్ దశలో వెయ్యి మందికి పైగా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. గత ఏడాది నుంచి ఈ యాప్‌ను టెస్టింగ్ చేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆగస్టు 15న జియో ఫోన్ యూజర్లను ఎంచుకునేందుకు వీలుగా యాప్ రూపొందించారు. జియో పే యాప్ వినియోగదారు ఇంటర్‌ఫేస్ పేటిఎమ్‌ల మాదిరిగానే ఉంటుంది.
యాప్ UPI పేమెంట్లకు సపోర్ట్ ఇస్తుంది. టోకనైజేషన్ సిస్టమ్‌లో బిల్డ్ చేసిన జియో పే యాప్, Tap చేసి Pay ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది. యుపిఐ ద్వారా డబ్బు పంపుకునేలా ఎనేబుల్ చేసింది. లావాదేవీల కోసం అన్ని బ్యాంకులకు సపోర్ట్ చేసేలా రూపొందించారు. జియో రీఛార్జ్ చేసుకోవచ్చు.. NFC POS డివైజ్ ద్వారా కాంటాక్ట్‌లెస్ NFC పేమెంట్లు కూడా చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి, పేమెంట్ సర్వీసులను అందించడానికి జియో యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, స్టాండర్డ్ చార్టర్డ్, ఇండస్‌ఇండ్, ఎస్‌బిఐ, కోటక్, యెస్‌బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నివేదిక తెలిపింది. ఈ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులు (మాస్టర్ కార్డ్, వీసా) రెండింటినీ టోకనైజ్ చేసి చెల్లింపు కోసం ఉపయోగించవచ్చని నివేదించింది.
టెల్కో Kai OS ఆపరేటింగ్ సిస్టమ్ కోసం UPI పేమెంట్ల లావాదేవీల వ్యవస్థను జియో ఫోన్‌లో తీసుకొచ్చింది. యుపిఐ PIN స్క్రీన్ కోసం NPCI లైబ్రరీ, యూజర్లు లావాదేవీల కోసం UPI PINను నమోదు చేయాల్సి ఉంటుంది.