Reliance Jio True 5G Services to Over 850 Major Cities across Telangana
Jio True 5G Services in Telangana : దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో (Reliance Jio) తెలంగాణ వ్యాప్తంగా జియో 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోని జియో యూజర్ల కోసం అన్ని జిల్లాలు, ప్రధాన పట్టణాలు, నగరాలు, గ్రామాలతో సహా 850కి పైగా ప్రాంతాల్లోకి జియో ట్రూ 5G సర్వీసులను విస్తరించింది. జియో యూజర్లకు ట్రూ 5G సర్వీసులను అందించడంలో జియో ఇతర టెలికం ఆపరేటర్ల కన్నా ముందంజలో ఉంది.
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ 1Gbps+ వరకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. జియో యూజర్ల కోసం జియో వెల్‌కమ్ ఆఫర్ (Jio Welcome Offer) ద్వారా ఉచితంగా అందిస్తోంది. జియో పర్యాటక ప్రదేశాలు, మాల్స్, ప్రభుత్వ భవనాలు, మార్కెట్లు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలు, హోటల్స్, రెస్టారెంట్లు, హాస్పిటల్స్, వాణిజ్య సంస్థల్లో జియో ట్రూ 5G నెట్‌వర్క్ మరింతగా విస్తరించింది.
Reliance Jio True 5G Services to Over 850 Major Cities across Telangana
కేవలం నగరాలు మాత్రమే కాదు.. పలు గ్రామాల్లో కూడా జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో సీఈఓ KC రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా, ప్రధాన నగరాలు, గ్రామాలు, పట్టణాలు సహా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5G సర్వీసులను విస్తరించినట్టు ఆయన చెప్పారు. 2023 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతి నగరం నుంచి గ్రామాల్లో ట్రూ 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.