Revolt RV400 Booking : ఎలక్ట్రిక్ బైక్.. రీ-బుకింగ్స్​ ప్రారంభం.. బుకింగ్ చేసుకోండిలా!

ఎలక్ట్రిక్​ మోటో సైకిల్​ తయారీ సంస్థ Revolt Motors భారత మార్కెట్లో తమ ప్రతిష్టాత్మక RV400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్​ను మళ్లీ ప్రారంభించింది. జూన్ 15 నుంచి RV400 ఎలక్ట్రిక్ బైక్ రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.

How to book Revolt RV400 : ఎలక్ట్రిక్​ మోటో సైకిల్​ తయారీ సంస్థ Revolt Motors భారత మార్కెట్లో తమ ప్రతిష్టాత్మక RV400 ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్​ను మళ్లీ ప్రారంభించింది. జూన్ 15 నుంచి RV400 ఎలక్ట్రిక్ బైక్ రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. అది కూడా డిస్కౌంట్ ధరతో ఆఫర్ చేస్తోంది. రాహుల్ శర్మ నేతృత్వంలోని బైక్ తయారీ సంస్థ రివోల్డ్ గత నెలలోనే RV400 బైక్​ బుకింగ్స్​ ప్రారంభించగా.. ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెండు గంటల్లోనే స్టాక్​ అంతా క్లియర్ అయిపోయింది. రెండు గంటల్లో రూ. 50 కోట్లకు పైగా విలువైన మోటార్​ సైకిళ్లను అమ్మేసింది.

భారత మార్కెట్లో RV400 బైక్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని సంస్థ మళ్లీ రీబుకింగ్స్ ప్రారంభించింది. ఈ బుకింగ్స్ కు కూడా భారీ రెస్పాన్స్ వస్తుందని కంపెనీ భావిస్తోంది. హైదరాబాద్​తో సహా దేశవ్యాప్తంగా ఉన్న 6 ప్రధాన నగరాల్లో ఈ నెల15 నుంచి RV400 బైక్ బుకింగ్స్​ మెదలవుతాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ బైకును బుక్ చేసుకోవాలంటే.. తమ కంపెనీ అధికారిక Revolt RV400 Bike వెబ్​సైట్​ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. గతంలో బుక్​ చేసుకోలేని కస్టమర్లు ఇప్పుడు మళ్లీ బుక్​ చేసుకోవచ్చునని ఆఫర్ చేస్తోంది.

Revolt RV400 ధర ఎంతంటే? :
రీవోల్డ్ మోటార్స్ కంపెనీ ఇటీవలే Revolt RV400 ధరను రూ.28వేల వరకు తగ్గించింది. FAME స్కీమ్ కింద భారత ప్రభుత్వం అందించిన సబ్సిడీతో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకు ధరను భారీగా తగ్గించింది. తగ్గింపు ధరతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర ప్రస్తుతం రూ. 90,799 (ఎక్స్ షోరూం)తో అందుబాటులో ఉంది. అంతకుముందు ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1,18,999 గా ఉంది. మరోవైపు అహ్మదాబాద్ లో ఈ బైకు ధర రూ.87వేలు పలుకుతోంది.

Revolt RV400 బుకింగ్ ఎలానంటే? :
రీవోల్డ్ మోటార్స్ కంపెనీ అధికారిక వెబ్ సైట్..(https://www.revoltmotors.com/) Revolt RV400 బైక్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగానే ప్రీ రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ బైక్ ను హర్యాణాలోని Manesar ప్లాంటులో రెవోల్ట్ మోటార్స్ ఉత్పత్తి చేస్తోంది. కస్టమర్లు బైక్ బుకింగ్స్ చేసుకున్న తర్వాత VOLT (vehicle online tracking) ఫెసిలిటీ ద్వారా ఎప్పటికప్పుడూ డెలివరీ ట్రాకింగ్ చేసుకోవచ్చు.

బుకింగ్ టైమింగ్స్ (Booking Timings) :
జూలై 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్ లైన్ బుకింగ్స్ మొదలవుతాయి. RV400 ఎలక్ట్రిక్ బైక్.. ప్రస్తుం ఢిల్లీ, ముంబై, పూణె, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ సహా 6 నగరాల్లో కంపెనీ బైకును విక్రయించనుంది. ఇప్పటికే బైక్ రిజిస్ట్రర్ చేసుకున్న కస్టమర్లు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి బుకింగ్స్ చేసుకోవచ్చు.

Revolt RV 400 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
ఈ బైక్ లో టాప్ స్పీడ్ 85kmph వరకు అందిస్తుంది. 3.24 KWh లిథియం అయాన్ బ్యాటరీ 75 వోల్ట్​ పవర్​ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్​ గంటకు 85 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. లొకేటర్/ జియో ఫెన్సింగ్, కస్టమైజ్డ్ సౌండ్​ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అదేవిధంగా మూడు రకాల రైడింగ్ మోడ్స్ Eco, Normal, Sport ఉన్నాయి. అందులో ఎకో మోడ్.. టాప్ స్పీడ్ 45kmph, 156km రేంజ్.. నార్మల్ మోడ్.. టాప్ స్పీడ్ 65kmph, 110km రేంజ్, స్పోర్ట్ మోడ్.. టాప్ స్పీడ్ 65kmph, 80km రేంజ్ తో రైడింగ్ స్టైల్ మార్చుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు