Samsung: శాంసంగ్‌ మొబైల్‌ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెటరంటే?

శాంసంగ్ గెలాక్సీ ఏ26 8GB+128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర 24,999.

ఆకర్షణీయమైన డిజైన్, ఏఐ, పెర్ఫార్మన్స్‌ వల్ల శాంసంగ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు చాలా పాపులర్ అయ్యాయి. గతంలో శాంసంగ్ గెలాక్సీ ఏ 36, గెలాక్సీ ఏ 56ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాజాగా, గెలాక్సీ ఏ 26ను లాంచ్ చేశారు. శాంసంగ్‌ గెలాక్సీ ఏ 26, గెలాక్సీ ఏ 36 ఫోన్లలో ఏ ఫోన్ బెస్ట్ అయితే ఆ ఫోన్‌ను కొనాలనుకుంటున్నవారు వీటి ఫీచర్ల గురించి తెలుసుకోవాల్సిందే.

డిజైన్, డిస్‌ప్లే
శాంసంగ్ గెలాక్సీ ఏ26, గెలాక్సీ ఏ36 రెండె స్మార్ట్‌ఫోన్లూ ప్లాస్టిక్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో వచ్చాయి. IP67 రేటింగ్‌ డస్ట్, వాటర్ రెసిస్టెంట్స్‌తో వీటిని తీసుకొచ్చారు. అయితే, గెలాక్సీ A36 కటే గెలాక్సీ A26 కొస్త మందంగా ఉంటుంది. గెలాక్సీ A26లో థికర్ బెజెల్స్‌ ఉన్నాయి. ఇది యూజర్లను ఆకర్షించవచ్చు.

Also Read: ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి..

రెండు స్మార్ట్‌ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చాయి. గెలాక్సీ A26 కంటే గెలాక్సీ A36 ఎక్కువ బ్రైట్‌నెస్‌ ఇస్తుంది. గెలాక్సీ A26లో ఉన్న ఆప్టికల్.. డిస్‌ప్లేలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌కు సపోర్ట్ ఇవ్వదు. గెలాక్సీ A36లో మాత్రం ఆ ఫీచర్ ఉంది. గెలాక్సీ A26లో ఫింగర్ ఫ్రింట్‌ స్కానర్ పవర్ బటన్‌లో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A26.. 6GB RAM, 128 GB UFS 2 స్టోరేజ్‌తో, ఎక్సినోస్ 1380 చిప్‌తో పనిచేస్తుంది. గెలాక్సీ A36 స్నాప్‌డ్రాగన్ 6 Gen 3తో నడుస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 5000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A26, గెలాక్సీ A36 రెండూ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వచ్చాయి. వాటిలో 50ఎంపీ మెయిన్‌ కెమెరాలు ఉంటాయి. అయితే, A36లో పెద్ద కెమెరా సెన్సార్ ఉంది. A26లో 2MP మాక్రో లెన్స్ ఉంది. A36లో 5MP మాక్రో లెన్స్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ26 8GB+128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర 24,999. కాగా, గెలాక్సీ A36 8GB+128GB స్టోరేజ్‌ ధర రూ.32,999.