IDBI Recruitment 2025: ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి..
అధికారిక వెబ్‌సైట్: www.idbibank.in ఓపెన్ చేయండి.

Vacancies in IDBI
ఐడీబీఐ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. వివిధ విభాగాలలో నియామకాలు చేపడుతోంది. బ్యాంకింగ్ రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణుల కోసం మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయాలని బ్యాంక్ భావిస్తోంది.
నియామక ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను ఐడీబీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. అప్లికేషన్ విండో ఏప్రిల్ 7న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ గ్రేడ్ బీ పోస్టులకు బ్యాంక్ అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల వివరాలను చూసుకుని దరఖాస్తులు చేసుకోవాలి. జనరల్ మేనేజర్ పోస్టులు 8, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు 42, మేనేజర్ గ్రేడ్ బీ పోస్టులు 69 ఉన్నాయి.
ఇలా అప్లై చేసుకోండి
- దరఖాస్తు ప్రక్రియ: పూర్తిగా ఆన్‌లైన్‌లో
- అధికారిక వెబ్‌సైట్: www.idbibank.in ఓపెన్ చేయండి
- కెరీర్స్ విభాగాన్ని తెరవండి
- SO రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి
- ప్రాథమిక వివరాలు నమోదు చేసుకోండి
- వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని టైప్ చేయండి
- విద్యా ధృవీకరణ పత్రాలు, ఐడీ, మొదలైనవి అప్‌లోడ్ చేయండి
- దరఖాస్తు రుసుము చెల్లించండి
- దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ వారికి రూ.1050
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి రూ.250