Vacancies in IDBI
ఐడీబీఐ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. వివిధ విభాగాలలో నియామకాలు చేపడుతోంది. బ్యాంకింగ్ రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణుల కోసం మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయాలని బ్యాంక్ భావిస్తోంది.
నియామక ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను ఐడీబీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. అప్లికేషన్ విండో ఏప్రిల్ 7న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ గ్రేడ్ బీ పోస్టులకు బ్యాంక్ అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల వివరాలను చూసుకుని దరఖాస్తులు చేసుకోవాలి. జనరల్ మేనేజర్ పోస్టులు 8, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు 42, మేనేజర్ గ్రేడ్ బీ పోస్టులు 69 ఉన్నాయి.
ఇలా అప్లై చేసుకోండి