Samsung Galaxy F70 Pro 5G : ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.26వేల శాంసంగ్ 5G ఫోన్ జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీపై రూ.2,250 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, అమోల్డ్ డిస్ప్లే ఫీచర్లు, ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్ వివరాలివే..
- Sreehari A
- Updated on- November 15, 2026 / 03:03 PM IST
Samsung Galaxy F70 Pro 5G
- రూ.2,250 తగ్గింపుతో శాంసంగ్ 5G ఫోన్..
- 6000mAh బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో అదిరిపోయే డీల్
- 50MP ట్రిపుల్ కెమెరా, భారీ బ్యాటరీ.. బ్యాంక్ ఆఫర్‌తో చౌకగా
Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి.. కొత్తగా 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మంచి కెమెరా, లాంగ్ టైమ్ బ్యాటరీ, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, ఫ్లిప్‌కార్ట్ అందించే ఈ ఆఫర్‌పై ఓసారి లుక్కేయండి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీపై ప్రస్తుతం ధర భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కూడా కలిపితే ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
రూ.2,250 వరకు ఆదా చేయొచ్చు :
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో 5జీ ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు లాంచ్ ధర రూ.25,999 నుంచి తగ్గి రూ.24,999కే అందుబాటులో ఉంది. అంటే నేరుగా రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఈ రెండు ఆఫర్లు కలిపితే.. మొత్తం రూ.2,250 ఆదా అవుతుంది. దీంతో ఫోన్ ధర రూ.23,749కు చేరుతుంది. అయితే, బ్యాంక్ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు, అర్హతలేంటో కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
Read Also : HMD 2320 Flip 4G : పాత రోజులు మళ్లీ వచ్చేస్తున్నాయా? HMD నుంచి కొత్త 4G ఫ్లిప్ ఫోన్.. ఫీచర్లు కేక..
శాంసంగ్ ఫోన్లో ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. డిస్ప్లేకు కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్లో 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్, జెమిని, ఏఐ వాయిస్ ట్రాన్స్ క్రిప్షన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా అందించారు.
ఇక ఈ ఫోన్లో 6,000mAh భారీ బ్యాటరీ మరో స్పెషాలిటీ.. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మొత్తంగా భారీ బ్యాటరీ, అమోల్డ్ డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది.
