Samsung Galaxy M17e 5G
Samsung Galaxy M17e 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ M17e 5జీ ఫోన్ రాబోతుంది. అతి త్వరలో అధికారికంగా లాంచ్ కానుంది. కంపెనీ బడ్జెట్ ఎమ్ సిరీస్‌లో ఈ లేటెస్ట్ ఫోన్ మార్చి 17న లాంచ్ కానుంది. భారీ బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, కొత్త ఏఐ ఫీచర్లతో రానుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ధర, లభ్యత (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఫోన్ అధికారిక ధర, స్టోరేజీ వేరియంట్ ఎంత అనేది కంపెనీ ఇంకా వెరిఫై చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 17న లాంచ్ కానుంది. లాంచ్ తర్వాత ఈ ఫోన్ వైబ్ వైలెట్, బ్లిట్జ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. రూ. 20వేల కన్నా తక్కువ ధర కేటగిరీలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. రాబోయే ఐక్యూ జెడ్11x, రియల్‌మి C83, రెడ్‌మి 15Cలకు గట్టి పోటీని ఇవ్వనుంది.
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ అడాప్టివ్ బ్రైట్‌నెస్, హై బ్రైట్‌నెస్ మోడ్ (HBM)కు సపోర్టు ఇస్తుంది. నేరుగా సూర్యకాంతిలో కూడా ఆటోమాటిక్‌గా విజిబిలిటీని అడ్జెస్ట్ చేస్తుంది. మన్నిక పరంగా శాంసంగ్ గెలాక్సీ M17e ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.
శాంసంగ్ M17e 5జీ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆర్మ్ మాలి-G57 జీపీయూతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లను శాంసంగ్ ఇంకా ధృవీకరించలేదు. గెలాక్సీ M17e 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా శాంసంగ్ వన్ యూఐ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 6 జనరేషన్ల OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా గ్యారెంటీ ఇస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ భారీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. కానీ, ఛార్జింగ్ స్పీడ్ ఇంకా వెల్లడి కాలేదు. కెమెరాల విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఫోన్ కేవలం 8.2mm మందంతో వస్తుంది. గ్లాస్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ (GFRP)ను ఐలాండ్ డిజైన్‌తో అందిస్తుంది. గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో పాటు శాంసంగ్ నాక్స్ వాల్ట్ ద్వారా హార్డ్‌వేర్-లెవల్ సేఫ్టీని అందిస్తుంది.