యూత్ ఫిదా కావాల్సిందే : రూ.15,000 బడ్జెట్‌లో శాంసంగ్ గెలాక్సీ M31

  • Publish Date - April 28, 2020 / 09:25 AM IST

సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లను ఊపేస్తోంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ M31 అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అప్పట్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన గెలాక్సీ M30 ఎంతో పాపులర్ అయింది. దీనికి అప్ గ్రేడ్ వెర్షన్ గెలాక్సీ M31 మార్కెట్లోకి వచ్చింది. యంగ్ మిల్లినియల్స్, జనరేషన్ z స్మార్ట్ ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ టాప్ ఎండ్ హార్డ్ వేర్‌తో వచ్చింది.

శాంసంగ్ కెమెరా డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే.. శాంసంగ్ M31 స్మార్ట్ ఫోన్‌లో 64MP క్వాడ్ లెన్స్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా చెప్పవచ్చు. క్వాడ్ రియర్ కెమెరా గిగాంటిక్ 64MP (0.8 µm)తో పాటు ISOCELL GWI సెన్సార్, f/1.8 అప్రెచర్ ఉండటంతో తక్కువ వెలుతురులోనూ క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు.

ఇక ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP డెప్త్ సెన్సార్ కెమెరా, 5MP మ్యాక్రో లెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా 4CM దూరంలోనే అద్భుతమైన షాట్స్ తీసుకోవచ్చు. స్టన్నింగ్ ప్రొర్ట్ ట్రేయిట్స్, డ్రామాటిక్ వైడ్ యాంగిల్ షాట్స్, క్రిస్ప్ మ్యాక్రో లెన్స్ హైరెజుల్యుషన్ ఫొటోలు తీసుకోవచ్చు.

4K రిజుల్యుషన్ వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో పాటు అదనంగా హైపర్ లాప్స్ రికార్డు చేసుకోవచ్చు. కొత్తగా యాడ్ అయిన సూపర్ స్టీడీ మోడ్ సాయంతో స్లో మోషన్, స్టేబుల్ వీడియోలను అద్భుతంగా వస్తాయి. 32MP భారీ సెల్ఫీ కెమెరా ద్వారా స్పష్టమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

ఫీచర్లు + స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ప్యానెల్ ఇన్ఫినిటీ-U డిస్‌ప్లే (19.5:9)
* సినీమాటిక్ వీడియో ప్లేబ్యాక్, సూపరియర్ గేమ్ ప్లే ఎక్స్ పీరియన్స్

* ఫుల్ హెచ్‌డి ప్లస్ ప్యానెల్, హై ఫిక్సల్ డెన్సిటీ, వివిడ్ కలర్స్
* 4K రిజుల్యుషన్ వీడియో రికార్డింగ్, రికార్డ్ హైపర్ ల్యాప్స్
* స్లో మోషన్, స్టేబుల్ వీడియోస్, సూపర్ స్టీడీ మోడ్
* భారీ 32MP సెల్ఫీ కెమెరా
* 6,000mAh భారీ బ్యాటరీ యూనిట్

సింగిల్ ఛార్జ్.. 48 గంటలు పవర్ :
శాంసంగ్ గెలాక్సీ M31 స్మార్ట్ ఫోన్‌లో హై డెన్సిటీతో కూడిన 6,000mAh బ్యాటరీ సామర్థ్యం అందిస్తోంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిరంతరాయంగా బ్యాటరీ వాడుకోవచ్చు. సుదీర్ఘ వీడియోలను ఎంతసేపు అయినా వీక్షించవచ్చు. ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. నిరంతరాయంగా 26 గంటల పాటు గేమింగ్ కోసం వినియోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ సామర్థ్యంతో పాటు 15W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయడమే కాదు.. అవసరమైనప్పుడల్లా తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ చేసుకోనే వీలుంది.

హార్ట్ వేర్.. సాఫ్ట్ వేర్ :
శాంసంగ్ గెలాక్సీ M31లో పర్ఫార్మెన్స్ ఒరియెంటెడ్ ఎక్సినోస్ 9611 అక్టా కోర్ చిప్ సెట్ అమర్చారు. దీనిద్వారా అద్భుతంగా ఎలాంటి అంతరాయం లేకుండా వేగంగా డివైజ్ రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌లో 6GB RAM, 64/128GB ROM, మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 10తో పాటు  శాంసంగ్ సొంత కొత్త One UI 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ కూడా పొందవచ్చు. ఇక స్టోరేజీ విషయానికి వస్తే.. గెలాక్సీ M31లో Micro SD కార్డు స్లాట్, Type-C పోర్ట్ కూడా ఉన్నాయి. అదనంగా కన్వెన్షనల్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది.

రూ.1000 డిస్కౌంట్ ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ M31 స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై అమెజాన్.ఇన్, శాంసంగ్.కామ్ వెబ్ సైట్లపై రూ.1000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది కంపెనీ. అలాగే ఇతర రిటైల్ స్టోర్లలో కూడా ఇదే డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాంతో గెలాక్సీ M31 వేరియంట్ (6GB RAM + 64GBమెమరీ ) ధర రూ.14,999లుగా, మరో వేరియంట్ (6GB RAM + 128GB మెమరీ) ధర రూ.15,999గా అందుబాటులో ఉంటుంది.