×
Ad

Samsung Galaxy M35 5G : కిర్రాక్ డిస్కౌంట్ భయ్యా.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. నెలకు జస్ట్ రూ. 796 EMI అంతే..!

Samsung Galaxy M35 5G : శాంసంగ్ ఆఫర్ అదిరింది. ప్రత్యేకించి శాంసంగ్ గెలాక్సీ M35 5జీపై కిర్రాక్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ క్రేజీ డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy M35 5G

Samsung Galaxy M35 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ M35 5జీ ఫోన్ ధర మరోసారి భారీగా తగ్గింది. గత ఏడాదిలో లాంచ్ అయిన ఈ శాంసంగ్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్ సమయంలో సరసమైన ధరకే లభించింది. లాంచ్ ధరపై ఏకంగా రూ. 9వేల వరకు తగ్గింపు పొందింది. ఈ శాంసంగ్ ఫోన్ (Samsung Galaxy M35 5G) గరిష్టంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M35 5G ధర తగ్గింపు :
శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
6GB ర్యామ్ + 128GB ప్రారంభ ధర రూ. 18,999
8GB ర్యామ్ + 128GB ధర రూ. 16,499
8GB ర్యామ్ + 256GB ధర రూ. 26,999
ఈ ఫోన్ అసలు ధర రూ.24,499.

మీరు ఈ శాంసంగ్ ఫోన్‌ను మూన్‌లైట్ బ్లూ, డేబ్రేక్ బ్లూ, థండర్ గ్రే అనే 3 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. మీరు 8GB వేరియంట్‌ రూ. 796 కన్నా తక్కువ ఈఎంఐతో ఇంటికి తెచ్చుకోవచ్చు.

Read Also : Top Brand Smart TVs : కొంటే ఇలాంటి టీవీలు కొనాల్సిందే.. 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు.. సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz హై రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. శాంసంగ్ ఇన్-హౌస్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా 2MP మాక్రో కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ శాంసంగ్ ఫోన్ పవర్‌ఫుల్ 6,000mAh బ్యాటరీతో 25W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్‌యూఐ OneUI 6పై రన్ అవుతుంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే గూగుల్ జెమిని-ఆధారిత గెలాక్సీ ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుంది.