Samsung Galaxy M36 5G : ఆఫర్ అదిరింది భయ్యా.. ఈ శాంసంగ్ 5G ఫోన్ ఫస్ట్ సేల్ ఇదిగో.. ఇలా కొన్నారంటే అతి చౌకైన ధరకే..!

Samsung Galaxy M36 5G : కొత్త శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ ఫస్ట్ సేల్ అందుబాటులో ఉంది. ధర ఎంతంటే?

Samsung Galaxy M36 5G

Samsung Galaxy M36 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ అధికారికంగా భారత మార్కెట్లో గెలాక్సీ M36 5G ఫోన్ (Samsung Galaxy M36 5G) లాంచ్ చేసింది. జూలై 13న ఈ శాంసంగ్ 5G ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ద్వారా లభించే స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సహా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. గత ఏడాదిలో గెలాక్సీ M35 5G ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా వచ్చింది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలంటే?

శాంసంగ్ గెలాక్సీ M36 ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB ధర రూ.17,499కు లభిస్తుంది. మిగిలిన రెండు వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.18,999, రూ.21,999కు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ యూజర్లు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.1,500 తగ్గింపుతో పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి రూ.15,999కి తగ్గుతుంది. ఈ శాంసంగ్ ఫోన్‌పై రూ.848 ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై ఉత్కంఠ.. రూ. 2వేలు పడే రైతుల జాబితా ఇదే.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..!

శాంసంగ్ గెలాక్సీ M36 5G స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz హైరిఫ్రెష్ రేట్, ప్రొటెక్టివ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే ట్రేడేషనల్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్‌ కలిగి ఉంది. ఇన్-హౌస్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ద్వారా 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వరకు కాన్ఫిగరేషన్‌లకు సపోర్టు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUI 7పై రన్ అవుతుంది. 6 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సర్కిల్-టు-సెర్చ్, జెమిని లైవ్, ఏఐ సెలెక్ట్‌తో సహా గూగుల్ జెమినీ ద్వారా వివిధ రకాల ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 50MP మెయిన్ OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ 4K వీడియో రికార్డింగ్, నైట్ మోడ్ షూటింగ్, లో-లైటింగ్ వీడియో వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. 5,000mAh బ్యాటరీతో పాటు 25W USB టైప్-C ఛార్జింగ్‌తో రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది.