Samsung Galaxy M47 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న బిగ్ ఫోన్ ఇదే.. ఫీచర్లపై భారీ హైప్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Samsung Galaxy M47 5G : భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రేంజ్ విస్తరిస్తోంది సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్.. ఇప్పుడు కొత్త శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. పూర్తి ఫోన్ ఫీచర్లు, లాంచ్ వివరాలివే..

Samsung Galaxy M47 5G

  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది
  • 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండొచ్చు
  • ఆండ్రాయిడ్ 8 ఆధారిత వన్ యూఐ 16 ఆపరేటింగ్ సిస్టమ్

Samsung Galaxy M47 5G : కొత్త శాంసంగ్ ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రేంజ్ శాంసంగ్ విస్తరిస్తోంది. లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ ‘నెక్స్ట్ లెవెల్ మాన్‌స్టర్’ M-సిరీస్ ట్యాగ్‌లైన్‌తో అమెజాన్‌లో క్యాంపెయిన్ టీజర్‌లో కనిపించింది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో SM-M476B/DS మోడల్ (Samsung Galaxy M47 5G) నంబర్‌తో కనిపించింది. అధికారిక లాంచ్ త్వరలో ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read Also : iPhone 17 Pro Price : ఆపిల్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఐఫోన్ 17 ప్రో మరి ఇంత తక్కువా.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..

ఎప్పుడు వస్తుందంటే? :
శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ రూ. 25వేల లోపు ధరలో రాబోతుంది. ఇప్పటికే ఉన్న మార్కెట్లో ఉన్న ఫోన్లకు గట్టి పోటీనివ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌, అలాగే శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉండనుంది.

డిజైన్ అదుర్స్ :
కొత్త శాంసంగ్ ఎం సిరీస్ మోడళ్లు ఎలా ఉంటాయనే దానిపై అధికారిక ప్రకటన లేదు. కానీ, మిడ్-రేంజ్ లైనప్‌లో ప్రీమియం రిఫ్రెష్‌ అని చెప్పొచ్చు. ఈ టీజర్‌లో డీప్ క్రిమ్సన్ లేదా మెరూన్ కలర్ వేరియంట్ మాదిరిగా కనిపిస్తుంది. బ్యాక్ ప్యానెల్ డార్క్ మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది. కెమెరా మాడ్యూల్, బయటి ఫ్రేమ్ ఎడ్జ్‌ల్లో మెటాలిక్ రెడ్ యాక్సెంట్‌లతో వస్తుంది.

స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ శాంసంగ్ ఫోన్ రౌండెడ్ కార్నర్ మోడ్రాన్ బాక్సీ ఫ్రేమ్‌తో వస్తుంది. కర్వడ్ కార్నర్ డిజైన్‌కు భిన్నంగా ఉంటుంది. రైట్ సైడ్ నాచ్, పవర్ బటన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ అందిస్తుంది.

ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది. చిప్, ర్యామ్ స్పెసిఫికేషన్‌లను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుందని అంచనా.