Samsung Galaxy S23 5G : శాంసంగ్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. మీరు కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్ గెలాక్సీ S23 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ప్రీమియం స్టైలిష్ లుక్ కూడా అందిస్తుంది. అసలు ధర కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్ షాపింగ్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ గేమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..
2/7
అమెజాన్ సేల్ ఆఫర్, డిస్కౌంట్ : శాంసంగ్ గెలాక్సీ S23 5జీ ధర విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 95,999కు కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ నుంచి 35 శాతం తగ్గింపుతో రూ. 61,990కి కొనుగోలు చేయవచ్చు.
3/7
బ్యాంక్ ఆఫర్లు : ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్ కింద అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో రూ. 1,859 తగ్గింపు పొందవచ్చు. రూ. 44,150 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కొనేసుకోవచ్చు. నిబంధనలు, షరతులతో ఈ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు రూ. 3,005 ఈఎంఐ ఆప్షన్లతో కూడా కొనుగోలు చేయవచ్చు.
4/7
శాంసంగ్ గెలాక్సీ S23 5జీ డిస్‌ప్లే : ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 6.1-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. రిజల్యూషన్ 2340×1080 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ అందిస్తుంది.
5/7
పర్ఫార్మెన్స్, OS ఆపరేటింగ్ సిస్టమ్ : ఈ శాంసంగ్ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ విషయానికి వస్తే.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
6/7
కెమెరా సెటప్ : కెమెరా సెటప్ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 10MP, మూడో కెమెరా 12MP కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
7/7
బ్యాటరీ బ్యాకప్, ఇతర ఫీచర్లు : ఈ శాంసంగ్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3900mAh బ్యాటరీతో వస్తుంది. WiFi, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంది.