ఏం ఆఫర్ భయ్యా.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీపై రూ.27,568 డిస్కౌంట్‌.. 

ఈఎంఐ ఆప్షన్‌లోనూ కొనుక్కోవచ్చు.

మంచి ఫీచర్లు ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీపై ప్రస్తుతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. అమోల్డ్‌ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, ఎస్‌ పెన్, టెలిఫోటో లెన్స్‌తో క్వాడ్ కెమెరా సెటప్, ఏఐ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లను ఆకర్షిస్తోంది.

అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్లను వాడుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ.27,000కు పైగా ఆదా చేసుకోవచ్చు. శాంసంగ్ స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ.1,09,999గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో మాత్రం రూ.84,980కే అందుబాటులో ఉంది.

Also Read: రెడ్‌ మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఇప్పుడే కొనేస్తే..

అంటే నేరుగా రూ.25,019 డిస్కౌంట్‌కు కొనుక్కోవచ్చు. అంతేకాదు, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును వాడి కొంటే అదనంగా రూ.2,490 తగ్గుతుంది. ఈఎంఐ ఆప్షన్‌లోనూ కొనుక్కోవచ్చు. కస్టమర్లు నెలకు రూ.4,120తో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.

మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్‌ ఉండి దాన్ని ఎక్స్‌చేంజ్‌ చేసుకుని శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీని కొనాలనుకుంటే మీకు అదనంగా రూ.7,350 ఎక్స్‌చేంజ్‌ ఆఫర్ వస్తుంది.

ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 6.8-అంగుళాల క్యూహెచ్‌డి+ డైనమిక్ అమోలెడ్ 2x స్క్రీన్‌తో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో అందుబాటులో ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, గరిష్ఠంగా 1,750 నిట్స్ బ్రైట్‌నెట్‌తో ఉంది.

ఇది అడ్రినో 740 GPU, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో వచ్చింది. IP68 రేటింగ్‌ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌తో దీన్ని లాంచ్ చేశారు. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి.