Samsung Galaxy S23 Ultra, iPhone 15 Plus
Top Smart Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుత భారత మార్కెట్లో ఏ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలో తెలియడం లేదా? స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వినూత్న ప్రొడక్టులను కలిగి ఉంటుంది. ఇందులో సరైన ఫోన్ ఎంచుకోవడం కష్టమే. ధరతో పాటు ఫీచర్లు, ఇతర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
అందువల్ల, మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఖర్చు చేసే ముందు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోవాలి. మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్లలో ఆపిల్, శాంసంగ్, ఇతర బ్రాండ్‌లలో కొన్ని టాప్ ప్రొడక్టులను అందిస్తున్నాం. ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా :
2023లో లాంచ్ అయిన శాంసంగ్ అత్యంత పాపులర్ పొందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్‌తో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వినియోగదారులకు అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అందించడానికి అసాధారణమైన కెమెరా సామర్థ్యాలను గెలాక్సీ ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రస్తుతం అమెజాన్‌లో 47శాతం తగ్గింపుతో కేవలం రూ.79999 విక్రయ ధరతో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 15 ప్లస్ :
అద్భుతమైన ఫీచర్లతో ఐఫోన్ 15 ప్లస్ కూడా 2023లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎ16 బయోనిక్ చిప్‌తో వస్తుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వాస్తవానికి, ఐఫోన్ 15 ప్లస్ రూ.79900కి రిటైల్ అవుతుంది. అయితే, అమెజాన్ నుంచి కొనుగోలుదారులు కేవలం రూ.69900కి పొందవచ్చు. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై గొప్ప 22శాతం డిస్కౌంట్ అందిస్తుంది.
వన్‌ప్లస్ 12ఆర్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. వన్‌ప్లస్ 12ఆర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో 8జీబీ ర్యామ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలతో వస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ రూ.39999 వద్ద లాంచ్ అయింది. అమెజాన్‌లో కేవలం రూ.35999కి అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు అదనపు బెనిఫిట్స్ కోసం బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎ35 :
అమెజాన్‌లో కొనుగోలుదారులు సరసమైన ధరకు శాంసంగ్ ద్వారా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎ35 8జీబీ ర్యామ్‌తో శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.33999కి రిటైల్ అవుతుంది. అయితే, అమెజాన్‌లో రూ.30999కి అందుబాటులో ఉంది.
పిక్సెల్ 8ప్రో :
గూగుల్ పిక్సెల్ 8ప్రో ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ జీ3 చిప్‌సెట్, 12జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏఐ ఫీచర్లు, జెమిని నానో సపోర్ట్‌తో వస్తుంది. ఏఐ యుగంలో స్మార్ట్‌ఫోన్‌ను స్మార్ట్‌గా మార్చింది. మీరు ఈ పిక్సెల్ 8 ప్రో అసలు ధర రూ.106999 ఉండగా రూ.63999 తగ్గింపు పొందవచ్చు.
Read Also : Mahindra XUV700 Price : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధర పెరిగిందోచ్.. కొత్త ధర ఎంతంటే?