Samsung Galaxy S23 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా తగ్గింపు ధరకే లభ్యమవుతోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S23 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ 2023 ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.
2/6
ఈ శాంసంగ్ 5G ఫోన్ ధర రూ. 41వేల కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోవడం బెటర్. శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ. 1,19,999 ఉండగా అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 75వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
3/6
శాంసంగ్ గెలాక్సీ ఫోన్ క్వాడ్-కెమెరా సెటప్, బ్రైట్‌నెస్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది. మీరు ఆకట్టుకునే కెమెరా, డిజైన్, పర్ఫార్మెన్స్, ఏఐ ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ అప్‌గ్రేడ్ కోసం ఎదురు చూస్తుంటే ఈ ఫ్లిప్‌కార్ట్ డీల్ అసలు వదులుకోవద్దు.
4/6
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా డీల్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ రూ.77,990 ధరకు లిస్ట్ అయింది. లాంచ్ ధర కన్నా రూ.41,910 తక్కువకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు అదనంగా రూ.4వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ధర రూ.75వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X స్క్రీన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,750 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. అడ్రినో 740 జీపీయూ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. త్వరలో వన్ యూఐ 7 అప్‌డేట్ అందనుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా మెరుగైన ఏఐ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
6/6
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 200MP OIS ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్, 10MP 3x టెలిఫోటో, 10MP 10x పెరిస్కోప్ లెన్స్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీ, 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంది.