ఏఐ ఫీచర్లు, మంచి పర్ఫార్మన్స్, అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉండే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా? ఇటువంటి స్మార్ట్‌ఫోనే దాదాపు రూ.30,000 డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.79,990. ట్రిపుల్ కెమెరా, AMOLED ప్యానెల్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకర్షిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ ఎలా పనిచేస్తుందో చూడండి..
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీను రూ. 44,999 వద్ద లిస్ట్ చేశారు. ధర రూ.30,000 తగ్గింది. అంతేకాదు, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని వాడి బిల్లు చెల్లిస్తూ మరో 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
Also Read: అంతరిక్షంలో యుద్ధ విన్యాసాలు.. ఇస్రో మరో ఘనత.. పాక్‌తో ఉద్రిక్తతల వేళ..
అంటే ధర రూ.44,000 కంటే తక్కువ అవుతుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకుంటే మీకు రూ.43,200 డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ.3,750 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల AMOLED ప్యానెల్‌తో వచ్చింది. 2,600 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ Exynos 2400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 512GB వరకు స్టోరేజ్‌తో వచ్చింది. 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.
చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, నౌ బ్రీఫ్, సర్కిల్ టు సెర్చ్ వంటి గెలాక్సీ కొత్త ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP OIS ప్రైమరీ, 8K రికార్డింగ్‌కు సపోర్టుతో, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫొటో బ్యాక్ సెన్సార్‌లతో ఉంది. 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.