Samsung Galaxy S24 Ultra Price
Samsung Galaxy S24 Price : శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై డీల్స్‌కు సంబంధించిన చాలా లీక్‌లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో, ఆపిల్ ఐఫోన్ల ధర తగ్గింపుకు సంబంధించిన లీక్‌లు రాగా, ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పాటు లీక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా డీల్ :
లీక్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ. 1,29,999 నుంచి రూ. 59,990కు అందుబాటులో ఉండనుంది. అయితే, ధరతో పాటు అన్ని బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్‌లతో తగ్గింపు పొందవచ్చు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా ఆర్మర్, DX యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 10MP టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కలిగి ఉంది. మల్టీఫేస్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ సెన్సార్ పొందుతుంది. 5000mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.