Samsung Galaxy S25 Edge
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ మరికొన్ని రోజుల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ అధికారికంగా తేదీని ప్రకటించకపోయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 16 లాంచ్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి యూరప్‌లో, ఏప్రిల్ 16 నుంచి భారత్ ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని అంచనా.
డిజైన్
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. కేవలం 5.84 మి.మీ మందంతో దీన్ని లాంచ్ చేయనున్నారు. దాని బరువు 162 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ ఫ్రేమ్ కోసం టైటానియంను వాడినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్లలో అందుబాటులోకి రానుంది. టైటానియం ఐసీ బ్లూ, టైటానియం జెట్ బ్లాక్, టైటానియం సిల్వర్‌తో లాంచ్ చేయనున్నారు.
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ 12 జీబీ ర్యామ్‌తో, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రానుంది. గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌లో హై-రిజల్యూషన్ ఫొటోగ్రఫీ కోసం 200 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కానుంది.
ధర ఎంత?
ఈ స్మార్ట్‌ఫోన్ 256GB వేరియంట్ ధర రూ.1,11,000 – రూ.1,20,400 మధ్య ఉండొచ్చు. ఇక 512 జీబీ వేరియంట్ ధర రూ.1,20,400 నుంచి రూ .1,29,600 మధ్య ఉండొచ్చని అంచనా. శాంసంగ్ ఇప్పటికే గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 25, ఎస్ 25+, ఎస్ 25 అల్ట్రా మోడల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పడు ఇదే సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ వేరియంట్ వస్తోంది.