Samsung Galaxy S25 : సూపర్ డిస్కౌంట్ మావా.. ఈ శాంసంగ్‌ ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!

Samsung Galaxy S25 : శాంసంగ్ గెలాక్సీ S25పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. రూ. 21,399 వరకు కూపన్ డిస్కౌంట్‌తో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S25

  • శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్
  • 12GB + 128GB వేరియంట్‌ రూ. 50,825 ధర మాత్రమే
  • బ్యాంకు డిస్కౌంట్లతో 256GB మోడల్ ధర రూ. 55,670 తగ్గింపు
  • 4,000mAh బ్యాటరీ, ప్రీమియం కెమెరా, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌

Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఆఫర్.. పాత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ గెలాక్సీ S25 ప్రస్తుతం మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్లు, కూపన్లు బ్యాంక్ ఆఫర్లతో ప్రస్తుతం అతి తక్కువ ధరకే లభిస్తోంది. రూ. 80,999 ధర విలువైన ఫోన్ ఇప్పుడు రూ. 51,000 లోపు ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. రూ. 50వేల ధరలో మంచి కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్‌ అసలు మిస్ చేసుకోవద్దు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 డీల్ ధర :
12GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ. 69,999గా ఉండగా లిమిటెడ్ టైమ్ (Samsung Galaxy S25) కూపన్‌తో ధర రూ. 16,499 తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే అదనంగా రూ. 2,675 తగ్గింపు పొందవచ్చు. దాంతో అసలు ధర రూ. 50,825కు తగ్గుతుంది.

Read Also : Kia Syros EV Launch : ఈవీ మార్కెట్‌లో కొత్త సెన్సేషన్.. కియా సిరోస్ EV వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌పై 526 కి.మీ రేంజ్..!

12జీబీ + 256జీబీ వెర్షన్ కూడా డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. అలాగే, రూ. 21,399 కూపన్‌తో ఈ ఫోన్ రూ. 79,999 ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో వినియోగదారులు రూ. 2,930 బ్యాంక్ డిస్కౌంట్‌ పొందవచ్చు. తద్వారా ధర రూ. 55,670కి తగ్గుతుంది. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే ఉంటుంది.

ఈ శాంసంగ్ ఫోన్ కొనాలా? వద్దా? :
స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే.. ఈ ధరకు గెలాక్సీ S25 అద్భుతమైన డీల్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. కాంపాక్ట్‌గా కలర్ ఆప్షన్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ ఏఐ ఆధారిత ఫీచర్ల కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. :
శాంసంగ్ ఇప్పటికీ 3x ఆప్టికల్ జూమ్‌తో స్పెషల్10MP టెలిఫోటో కెమెరా అందిస్తోంది. సాధారణ సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు మరో 6 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు కూడా వస్తాయి. ఈ ఫోన్‌కు శాంసంగ్ లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు కూడా అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ 4,000mAh బ్యాటరీతో వస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, కాంపాక్ట్ డిజైన్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో వస్తుంది. శాంసంగ్ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్ అని చెప్పొచ్చు.