Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్‌ ఆఫర్ అదిరిందిగా.. ఈ శాంసంగ్ అల్ట్రా 5Gపై ఏకంగా రూ.51,000 తగ్గింపు..

Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ రూ.51వేల కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. పూర్తి ఆఫర్, ధర వివరాలివే..

Samsung Galaxy S25 Ultra 5G

  • శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీపై 200MP మెయిన్ కెమెరా
  • 5000mAh బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌
  • అసలు ధర రూ.1,29,999 నుంచి ధర రూ.78,499కి తగ్గింపు

Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 ప్రారంభమైంది. ఈ పండుగ సీజన్ సందర్భంగా అనేక ఆఫర్లను అందిస్తోంది. గత ఏడాదిలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీ కూడా పొందొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది. పూర్తి ఆఫర్ వివరాలివే..

ఆఫర్లు, డీల్స్ :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ (టైటానియం వైట్ సిల్వర్) ఈ-కామర్స్ సైట్‌లో రూ.94,999 ధరకు లిస్ట్ అయింది. ఈ సేల్ సమయంలో కూపన్ ఆఫర్ ద్వారా నేరుగా రూ.10వేలు ఆదా చేయొచ్చు. దాంతో అసలు ధర రూ.84,999కి తగ్గుతుంది. అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీపై ఇన్‌స్టంట్ రూ.6,500 తగ్గింపు లభిస్తుంది. ధర రూ.78,499కి తగ్గుతుంది.

Read Also : Apple iPhone 15 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇంతకన్నా తక్కువ ధరకు మళ్లీ దొరకదు!

ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది భారత మార్కెట్లో రూ.1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా రూ.51,500 తక్కువకే లభిస్తోంది. కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 1400×3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీ ఉంది.

5జీ, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. పొడవు 162.8 మిమీ, వెడల్పు 77.6 మిమీ, మందం 8.2 మిమీ, 218 గ్రాముల బరువు ఉంటుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.