WhatsApp New Feature : వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కాంటాక్ట్స్, బర్త్డే రిమైండర్స్, ఆన్లైన్ స్టేటస్ అన్నీ ఒకేచోట!
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ రాబోతుంది. కొత్త కాంటాక్టు ట్యాబ్ అందుబాటులోకి రానుంది. ఆన్ లైన్ స్టేటస్, బర్త్ డే రిమైండర్లు వంటివి యాక్సస్ చేయొచ్చు..
WhatsApp New Feature
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్
- కాంటాక్టుల ట్యాబ్తో ఇక వెతకడం ఈజీ
- ఆన్ లైన్ స్టేటస్, బర్త్ డే రిమైండర్లు చూడొచ్చు
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు పండగే.. అతి త్వరలో కొత్త ఫీచర్ వస్తోంది. ఇకపై వాట్సాప్ యూజర్లు తమ కాంటాక్టులను ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఇందుకోసం స్పెషల్ కాంటాక్ట్స్ ట్యాబ్ (Contacts Tab) ఫీచర్ అందుబాటులోకి రానుంది.
టెస్టింగ్లోనే ఫీచర్ :
ఈ కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తే చాలు.. అందులోనే మీ కాంటాక్టు వివరాలు, బర్త్ డే రిమైండర్లను ఒకే దగ్గర చూడొచ్చు. WABetainfo రిపోర్టు ప్రకారం.. ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్ల కోసం ఈ కొత్త కాంటాక్టుల ట్యాబ్ డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. అలాగే, బీటా టెస్టర్లకు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు.
కాంటాక్టుల ట్యాబ్ ద్వారా అన్ని ఒకే స్క్రీన్ పై చూడొచ్చు. టాప్ కార్నర్లో సెర్చ్ బార్ ఒకటి కనిపిస్తుంది. ఇందులో మీ పేరు, ఫోన్ నంబర్, యూజర్ నేమ్ సెర్చ్ చేసి కాంటాక్టులను సెర్చ్ చేయొచ్చు. అయితే, కాంటాక్టుల లిస్టును యూజర్లు తమకు అవసరమైన విధంగా సెట్ చేసుకోవచ్చు. యాక్టివిటీ (Activity) ఆప్షన్ ద్వారా ఆన్లైన్లోని కాంటాక్టులను ముందుగానే చూడొచ్చు. అదేవిధంగా, ఆల్ఫాబెటికల్ ఆప్షన్ ఎంచుకుంటే అదే ప్రకారం కాంటాక్టులు కనిపిస్తాయి.
Read Also : Amazon Layoffs : అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఈసారి 1000 మంది ఔట్.. ఇండియాలో కూడా..!
ఆన్ లైన్ స్టేటస్ చూడొచ్చు :
వాట్సాప్ కొత్త కాంటాక్టు ట్యాబ్ అనేది ప్రొఫైల్ ఫొటో పక్కనే గ్రీన్ డాట్ కనిపిస్తుంది. అంటే ఆ యూజర్ ప్రస్తుతం ఆన్ లైన్ లో ఉన్నాడా? లేదా అనేది తెలిసిపోతుంది. అది కూడా యూజర్ ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా పెట్టాడు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏ యూజర్ అయినా ఆన్ లైన్ స్టేటస్ హైడ్ చేసి ఉంటే మాత్రం అక్కడ మీకు గ్రీన్ డాట్ కనిపించదు. అంతేకాదు.. లాస్ట్ సీన్ స్టేటస్ కూడా హిడెన్ కాంటాక్టులను ఈజీగా గుర్తించవచ్చు.
కాంటాక్టుల ట్యాబ్ లో బర్త్ డే రిమైండర్లు కూడా చూడొచ్చు. మీ వాట్సాప్ లోని కాంటాక్టులకు ఆ రోజు ఏమైనా పుట్టినరోజు ఉంటే అదే పేరుతో కేక్ ఎమోజీ, బర్త్డ్ డే టుడే అనే లేబుల్స్ ఉండొచ్చు. కాంటాక్టు ట్యాబ్ నుంచే ఈజీగా ఆయా యూజర్లకు విషెస్ చెప్పొచ్చు.
