Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ ఫోన్ ధర తగ్గిందోచ్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే అమ్ముడవుతోంది. ఫ్లిప్‌కార్ట్ బై బై 2025 సేల్ సమయంలో ప్రతి కస్టమర్ లేటెస్ట్ S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు రూ.24వేలు సేవ్ చేసుకోవచ్చు.
2/7
ఈ శాంసంగ్ ఫోన్ రూ.1,29,999 ధరకు లాంచ్ అయింది. అన్ని బ్యాంక్ ఆఫర్లతో కలిపి దాదాపు రూ.1,05,999 ధరకు అమ్ముడవుతోంది. మీ శాంసంగ్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్ కావచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ధర ఎంతంటే? : ప్రస్తుతానికి, కస్టమర్లు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ రూ.1,09,999 ధరకు పొందవచ్చు. లాంచ్ ధరతో పోలిస్తే.. రూ.20వేలు తక్కువగా ఉంటుంది. ఇంకా, కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ లేదా ఎస్బీఐ కార్డ్‌తో రూ.4వేలు తగ్గింపు కూడా పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి దాదాపు రూ.1,05,000కి తగ్గుతుంది.
4/7
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే.. మీ డివైజ్ కండిషన్, బ్రాండ్, మోడల్ ఇతర అంశాలను బట్టి రూ.68,050 వాల్యూను పొందవచ్చు. నెలకు రూ. 3,868 నుంచి ఈఎంఐ ఆప్షన్లనతో ఎంచుకోవచ్చు.
5/7
అయితే, మీ బ్యాంక్ కండిషన్స్ బట్టి ఫైల్ ఛార్జీలు, ఇతర హిడెన్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా, ఫ్లిప్‌కార్ట్ అదనపు ఖర్చుతో ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
6/7
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్లతో 6.9-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. స్క్రోలింగ్, కంటెంట్ స్ట్రీమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌తో వస్తుంది.
7/7
కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్, 50MP పెరిస్కోప్, 10MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను అందిస్తుంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.