×
Ad

Samsung Galaxy S25 Ultra : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy S25 Ultra : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ఆఫర్లు, డిస్కౌంట్లను ఎలా పొందాలంటే?

Samsung Galaxy S25 Ultra (Image Credit To Original Source)

  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై దిమ్మతిరిగే డిస్కౌంట్
  • అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా రూ. 4,049 వరకు అదనపు డిస్కౌంట్
  • 200MP మెయిన్ సెన్సార్‌, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు

Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే డీల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. మీరు ఎలాంటి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేకుండా రూ. 7వేలు సేవ్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 4,049 వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ పవర్‌ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది.

16GB వరకు ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజీ కెపాసిటీని అందిస్తుంది. 200MP మెయిన్ సెన్సార్‌తో అడ్వాన్స్ కెమెరా సిస్టమ్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5000mAh బ్యాటరీని అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ డిస్కౌంట్లు ఆఫర్లతో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ 12GB ర్యామ్, ప్లస్ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,49,999కి లాంచ్ అయింది. కానీ, అమెజాన్ రిపబ్లిక్ డే డీల్‌లో 5శాతం తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను రూ. 1,34,999కే పొందవచ్చు. మీరు రూ. 7వేలు సేవ్ చేసుకోవచ్చు.

అదనంగా, మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా పేమెంట్ చేస్తే.. అదనంగా రూ. 4,049 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఒకేసారి ఫుల్ పేమెంట్ చేస్తే.. రూ. 9,086 నో-కాస్ట్ ఈఎంఐ, గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ కొనేసుకోవచ్చు.

Samsung Galaxy S25 Ultra (Image Credit To Original Source)

కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.7 ఎపర్చరు OISతో 200MP మెయిన్ సెన్సార్ ఉంటుంది. అలాగే 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ అందిస్తుంది.

అడ్వాన్స్ కెమెరా సిస్టమ్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ డ్యూయల్ పిక్సెల్ PDAFతో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5000mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Realme Neo 8 Launch : రియల్‌మి ఫోన్ కిర్రాక్ భయ్యా.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వస్తోందోచ్.. ఈ నెల 22నే లాంచ్.. ధర మీ బడ్జెట్‌లోనే..?

డిస్‌ప్లే, డిజైన్ :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1440×3120 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. 2600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కూడా అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ టైటానియం ఫ్రేమ్‌ కూడా పొందుతుంది. ఇంటిగ్రేటెడ్ S పెన్ స్టైలస్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సర్కిల్ టు సెర్చ్ వంటి అడ్వాన్స్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ గెలాక్సీ చిప్‌సెట్, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. 256GB, 512GB లేదా 1TB UFS 4.0 స్టోరేజ్‌ ఆప్షన్లు, 12GB లేదా 16GB ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 వన్ యూఐ7తో రన్ అవుతుంది. 7 మెయిన్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లను కూడా అందిస్తుంది.