Realme Neo 8 Launch : రియల్‌మి ఫోన్ కిర్రాక్ భయ్యా.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వస్తోందోచ్.. ఈ నెల 22నే లాంచ్.. ధర మీ బడ్జెట్‌లోనే..?
Realme Neo 8 Launch : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.. ధర, ఇతర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
Realme Neo 8 Launch (Image Credit To Original Source)
- జనవరి 22న రియల్‌మి నియో 8 లాంచ్ కానుంది
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాలు స్పెషల్ అట్రాక్షన్
- సింగిల్ రీఛార్జ్‌తో 2 రోజుల బ్యాటరీ బ్యాకప్
Realme Neo 8 Launch : కొత్త రియల్‌మి వస్తోందోచ్.. జనవరి 22, 2026న చైనాలో లాంచ్ కానుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ బేస్ వేరియంట్ దాదాపు రూ. 29,990 ధర ఉండొచ్చు. సైబర్ పర్పుల్, మెచా గ్రే, ఆరిజిన్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు. సెమీ-ట్రాన్స్పరెంట్ RGB డిజైన్ కూడా ఉంటుంది.
కెమెరా సెటప్, బ్యాటరీ ప్యాక్ :
రియల్‌మి నియో 8 ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. OISతో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఫోన్‌లో భారీ 8000mAh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణ వినియోగంలో 2 రోజుల బ్యాకప్ అందిస్తుంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇవ్వవచ్చు. 5W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
డిస్‌ప్లే, డిజైన్ :
రియల్‌మి నియో 8 ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ శాంసంగ్ M14 డిస్‌ప్లే, అల్ట్రా-స్మూత్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుందని భావిస్తున్నారు. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన స్మూత్‌నెస్‌ను అందిస్తుంది. 6000 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ కూడా చేరుకోవచ్చు.

Realme Neo 8 Launch (Image Credit To Original Source)
ఎలాంటి కాంతి స్థితిలోనైనా డిస్ ప్లే వ్యూ అద్భుతంగా ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP66, IP68, IP69 వంటి హై రేటింగ్ ఉంటుంది. స్క్రీన్‌కు క్రిస్టల్ ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
అదేవిధంగా, ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB లేదా 16GB LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు.
ఈ రియల్‌మి ఫోన్ ఆండ్రాయిడ్ 16లో రియల్‌మి యూఐ 7తో రన్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్, బోస్ ట్యూన్ సిమెట్రిక్ స్టీరియో స్పీకర్లు, 50 కన్నా ఎక్కువ టైటిళ్లకు సపోర్టు ఇచ్చే పీసీ హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ మోడ్ ఉండవచ్చు.
