Samsung Galaxy A55 : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఈ శాంసంగ్ గెలాక్సీ A55పై ఊహించని డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Samsung Galaxy A55 Price : శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ ధర తగ్గిందోచ్.. ప్రస్తుతం అమెజాన్ సేల సమయంలో రూ. 16వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A55 : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఈ శాంసంగ్ గెలాక్సీ A55పై ఊహించని డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Samsung Galaxy A55 Price (Image Credit To Original Source)

Updated On : January 21, 2026 / 7:11 PM IST
  • శాంసంగ్ గెలాక్సీ A55 ధర భారీగా తగ్గింపు
  • అమెజాన్‌లో రూ. 16వేలు తగ్గింపు, రూ. 22,500 వరకు ఎక్స్ఛేంజ్
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు

Samsung Galaxy A55 Price : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ ధర భారీ తగ్గింపుత లభిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ సేల్ సమయంలో శాంసంగ్ A55 ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

క్లీన్ వన్ యూఐ ఇంటర్‌ఫేస్‌ కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ బేస్ వేరియంట్ రూ. 39,999 ధర వద్ద లాంచ్ కాగా, ఇప్పుడు అమెజాన్‌లో రూ. 25వేల కన్నా తక్కువ ధరకు లభిస్తోంది. ఈ ధర తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్, కార్డ్ ఆఫర్‌లను పొందవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ రూ.39,999 ధరకు లాంచ్ కాగా ప్రస్తుతం రూ.23,998 ధరకు లభ్యమవుతోంది. తద్వారా రూ.16,001 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతే కాదు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలుదారులు ఈఎంఐ వడ్డీపై రూ.1,146.32 వరకు సేవ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy A55 Price

Samsung Galaxy A55 Price (Image Credit To Original Source)

అదనంగా, అమెజాన్ నెలకు రూ.844 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ కోసం అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి కొనుగోలుదారులు రూ. 22,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

Read Also : Amazon Republic Day Sale : అమెజాన్ సేల్ ఆఫర్లు.. వన్‌ప్లస్, ఐక్యూ, శాంసంగ్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ A55 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.60-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అదనంగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. 4 జనరేషన్ల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. 5000mAh బ్యాటరీతో 25W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP కెమెరా, 5MP కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ సింగిల్ 32MP సెన్సార్‌తో వస్తుంది.