Samsung Galaxy S25 Ultra : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ ముందుగానే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 36వేలు తగ్గింపు పొందవచ్చు..
- Sreehari A
- Published on- July 2, 2026 / 10:02 PM IST
Samsung Galaxy S25 Ultra
- అమెజాన్ ప్రైమ్ డే 2026కు ముందు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై భారీ తగ్గింపు
- క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో కొనేసుకోవచ్చు
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 200MP కెమెరా, 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్ జూలై 4 నుంచి ప్రారంభం కానుంది. సేల్ సమయంలో అనేక కేటగిరీలలో పలు డివైజ్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందించనుంది. మీరు శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ మోడల్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ భారీ సేల్‌కు ముందే అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ (Samsung Galaxy S25 Ultra) అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్, లోపల స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ కూడా ఉంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో S25 అల్ట్రా 5జీ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఇప్పుడు అమెజాన్‌లో రూ. 93,999కే లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 1,29,999 ఉండగా ఇప్పుడు సేల్ సమయంలో రూ. 36వేలు తగ్గింపుతో వస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే కొనుగోలుదారులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Read Also : Visa Passkey : వీసా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక OTP, పాస్‌వర్డ్ అక్కర్లేదు.. జస్ట్ పాస్‌కీతోనే పేమెంట్లు..!
ఈ ఆఫర్ కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు కాకపోతే 3 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నెలకు రూ. 3,305 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి రూ. 35,900 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. ప్రత్యేకంగా గెలాక్సీ ఫోన్ల కోసం రూపొందించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 200MP మెయిన్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా, 50MP వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
ఈ ఫోన్ కొనాలా? వద్దా? :
ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మంచి అల్ట్రా వెర్షన్ కోసం చూస్తున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్ కొనేవారికి ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇందులో అడ్వాన్స్ ప్రాసెసర్, 200MP కెమెరా సిస్టమ్, అద్భుతమైన అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ కన్నా మంచి ఫోన్ కోసం చూస్తుంటే వివో X300 అల్ట్రా, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొనేసుకోవచ్చు.
