Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా వివరాలను లీక్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, బ్లూ, గ్రీన్, టైటానియం కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

Samsung Galaxy S25 Ultra to Debut ( Image Source : Google )

Samsung Galaxy S25 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? 2025 ప్రారంభంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం నుంచి సరికొత్త నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా పేరుతో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త శాంసంగ్ ఫోన్ వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపించాయి. రాబోయే ఫోన్‌ సంబంధించి చిప్‌సెట్, డిజైన్, కెమెరా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా రిటైల్ వెర్షన్ మొత్తం 4 కలర్ ఆప్షన్లను లీక్ చేసింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్ కంపెనీ విక్రయించే ఆన్‌లైన్-స్పెషల్ కలర్ ఆప్షన్లలో కూడా వస్తుందని భావిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కలర్ ఆప్షన్లు (అంచనా) :
టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ (యూనివర్స్ ఐస్) ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా వివరాలను లీక్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, బ్లూ, గ్రీన్, టైటానియం కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. నివేదిక ప్రకారం.. కంపెనీకి సంబంధించిన లీక్‌ల విషయానికి వస్తే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. శాంసంగ్ సాధారణంగా వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లను అందిస్తుంది.

గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ ఆన్‌లైన్-మాత్రమే కలర్ ఆప్షన్లతో రానుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం, కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్, టైటానియం ఆరెంజ్‌లలో గెలాక్సీ ఎస్24 అల్ట్రాను కొనుగోలు చేయవచ్చు. ఈ కలర్ ఫొటోలను టిప్‌స్టర్ షేర్ చేయలేదు. గత నెలలో హ్యాండ్‌సెట్ కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ (CAD) రెండర్‌లను లీక్ చేసింది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో గత మోడల్ మాదిరిగా కాకుండా, గెలాక్సీ ఎస్25 అల్ట్రా సర్కిల్ షేప్ కలిగి ఉండవచ్చు.

ఇటీవలి నివేదికల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (లేదా స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 4) చిప్‌తో అమర్చి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ లిస్టింగ్‌లో గుర్తించారు. 12జీబీ ర్యామ్‌తో అమర్చిన ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుందని వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 6.86-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను సన్నని బెజెల్స్‌తో కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 200ఎంపీ ప్రైమరీ కెమెరా, 10ఎంపీ 3ఎక్స్ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, అప్‌గ్రేడ్ 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. 45డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : iQOO 13 Design Leak : కొత్త ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, ఫీచర్లు లీక్..!