Samsung Galaxy S27 Pro : శాంసంగ్ గెలాక్సీ S27 ప్రో లీక్స్.. అదిరిపోయే కెమెరా, 5200mAh బ్యాటరీతో కొత్త ఫ్లాగ్‌షిప్!

Samsung Galaxy S27 Pro : శాంసంగ్ గెలాక్సీ S27 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి. 200MP కెమెరా, 5200mAh బ్యాటరీ, 16GB ర్యామ్, డిజైన్, అంచనా ధర వివరాలేంటో ఓసారి చూద్దాం..

Samsung Galaxy S27 Pro

  • శాంసంగ్ గెలాక్సీ S27 ప్రో వచ్చేస్తోంది..
  • డిజైన్, ఫీచర్లు, 200ఎంపీ కెమెరా, 16GB ర్యామ్
  • గెలాక్సీ S27 అల్ట్రాకు గట్టి పోటీనా?

Samsung Galaxy S27 Pro : శాంసంగ్ లవర్స్ కు పండగే.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఫుల్ క్రేజే ఉంటుంది. ముఖ్యంగా గెలాక్సీ S సిరీస్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఇప్పుడు రాబోయే శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ విషయంలోనూ వరుస లీక్స్ బయటకు వస్తున్నాయి. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫోన్ గెలాక్సీ S27 ప్రో మోడల్.. ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లపై ఆసక్తికరమైన వివరాలు వినిపిస్తున్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

డిజైన్, డిస్‌ప్లే అదుర్స్ :
లీకైన CAD రెండర్ల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S27 ప్రో డిజైన్ ఎస్27 అల్ట్రా తరహాలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాక్ సైడ్ కొత్త హారిజాంటల్ కెమెరా ఐలాండ్ కనిపించనుంది. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా. కొలతలు 154.06 x 73.77 x 7.95mmగా ఉండనున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. అయితే, అల్ట్రా మోడల్‌లో ఉండే ఎస్ పెన్ మాత్రం ఇందులో ఉండకపోవచ్చని తెలుస్తోంది..

Read Also : Big Tech vs Publishers : మెటా, గూగుల్‌కు కొత్త కాపీరైట్ సెగ.. AI కోసం కంటెంట్ వాడితే పబ్లిషర్లకు డబ్బులు కట్టాల్సిందేనా?

200MP కెమెరాతో అదరగొట్టే ఛాన్స్ :
కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ ఉండొచ్చని సమాచారం.. 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా అందించే ఛాన్స్ ఉంది.

ప్రాసెసర్, బ్యాటరీ ఎలా ఉంటాయంటే? :
ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 6 ఎక్స్ ట్రీమ్ చిప్‌సెట్, 16GB వరకు ర్యామ్, 1TB స్టోరేజ్ ఉండొచ్చని టాక్. అలాగే 5,200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9తో వచ్చే అవకాశం ఉంది.

ధర ఎంతంటే? :
అమెరికాలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్27 ప్రో ప్రారంభ ధర 1,200 నుంచి 1,300 డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లోకి వస్తే.. ధర మరింత ఆసక్తికరంగా మారనుంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి లీక్స్ మాత్రమే. శాంసంగ్ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..