Samsung Galaxy Watch_ These new features will allow users to stream live video
Samsung Galaxy Watch : గ్లోబల్ మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. చాలావరకూ స్మార్ట్‌వాచ్‌లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అందులో ఎక్కువగా హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కలిగిన మోడల్స్ యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ వాచ్ తయారీదారులు కూడా అద్భుతమైన డిజైన్లతో వాచ్‌లను రూపొందిస్తున్నారు. లేటెస్టుగా ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తమ గెలాక్సీ వాచ్ డివైజ్‌ల్లో మరిన్ని స్మార్ట్ హోమ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులు తమ స్మార్ట్‌వాచ్‌లలో ఇంటి నుంచి లైవ్ ఫీడ్‌లు, డోర్‌బెల్ రింగ్‌లు, నెస్ట్ కెమెరాలను వీక్షించవచ్చు. రింగ్ కెమెరా యూజర్లు తమ గెలాక్సీ వాచ్ నుంచి రెండు-వే ఇంటర్‌కామ్ ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చని నివేదిక వెల్లడించింది. కంపెనీ మొట్టమొదట 2021 ప్రారంభంలో స్మార్ట్‌థింగ్స్ పర్యావరణ వ్యవస్థకు నెస్ట్ ఇంటిగ్రేషన్‌ను తీసుకువచ్చింది.
Samsung Galaxy Watch_ These new features will allow users to stream live video
Read Also : Fitbit Smart Watches: గూగుల్ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్.. పది లక్షల వాచ్‌లు రిటర్న్
అంతేకాకుండా, గెలాక్సీ వాచ్ యూజర్లు త్వరలో వారి చేతిపై థర్మోస్టాట్‌లు, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, బ్లైండ్‌ల వంటి వైడ్ రేంజ్ డివైజ్‌లను కంట్రోల్ చేసుకోవచ్చు. టీవీలు, ఎయిర్ కండీషనర్లు, లైట్లు, ఇతర డివైజ్‌లను ఇప్పటికే ఉన్న గెలాక్సీ వాచ్ సపోర్ట్‌పై అందిస్తోంది. వినియోగదారులు తమ స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేయడానికి స్మార్ట్ థింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.
ఆ ఫంక్షన్లను యాక్సెస్ చేసేందుకు యూజర్లు తమ వాచ్ ఫేస్ నుంచి కుడివైపుకు స్వైప్ చేయాలని నివేదిక తెలిపింది. ఈ అప్‌డేట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో శాంసంగ్ వెల్లడించలేదు. ఈ ఏడాది ‘EX1’ పేరుతో హ్యూమన్ అసిస్టెంట్ రోబోను రిలీజ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. రోబోలను కొత్త గ్రోత్ ఇంజిన్‌గా చూస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలోపు EX1 అనే హ్యూమన్ అసిస్టెంట్ రోబోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్, CEO హాన్ జోంగ్-హీ తెలిపారు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..