Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ఇదిగో.. ఇలా కొన్నారంటే రూ. 11వేలు డిస్కౌంట్.. ఇంకా తగ్గాలంటే?

Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 డీల్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ కన్నా ముందుగానే రూ. 11వేలు తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published on- September 29, 2026 / 08:12 PM IST

Samsung Galaxy Z Fold 8

  • అక్టోబర్ 9న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 ప్రారంభం
  • ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ క్రెడిట్ కార్డ్ సభ్యులు అక్టోబర్ 8 నుంచే యాక్సస్
  • శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ డీల్

Samsung Galaxy Z Fold 8 : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ క్రెడిట్ కార్డ్ సభ్యులు ఒక రోజు ముందుగానే, (అక్టోబర్ 8న) ఈ డీల్స్‌ను పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ బీబీడీ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌లు, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ మరిన్నింటితో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు.

అయితే, ఈ సేల్ కన్నా ముందుగానే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కొనేందుకు చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్‌ను అందిస్తోంది. తద్వారా మీరు రూ. 11వేల వరకు ఆదా చేసుకోవచ్చు. సేల్‌కు ముందు అద్భుతమైన ఆఫర్. ఈ డీల్ వివరాలు ఫోన్ స్పెసిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి..

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అధికారిక ధర రూ. 1,74,999 మాత్రమే. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 11వేలు తగ్గింపు పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు రూ. 7వేలు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా అసలు ధరను మరింత తగ్గించుకోవచ్చు.

Read Also : Tata EV BaaS Scheme : మిడిల్ క్లాస్ కోసం టాటా చీపెస్ట్ EVలు.. 530 కి.మీ రేంజ్, మోడ్రన్ ఫీచర్లు.. ధర కేవలం రూ.4.60 లక్షలే!

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఫోన్ 7.6-అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే, 5.5-అంగుళాల కవర్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ రెండు డిస్‌ప్లేలు, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ విజన్ బూస్టర్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌ అమర్చారు.

16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాదు.. జెడ్ ఫోల్డ్ 8లో 4,800mAh డ్యూయల్ బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోల్డబుల్ ఫోన్ రెండు డిస్‌ప్లేలపైనా 10MP కెమెరాతో వస్తుంది.