Samsung Galaxy G Fold : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Samsung Galaxy G Fold : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. డబుల్ కాదు.. ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్.. లాంచ్‌‌కు ముందే ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Samsung Galaxy G Fold

Samsung Galaxy G Fold : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ ఫోన్‌తో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శాంసంగ్ తాత్కాలికంగా శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ పేరుతో లాంచ్ కానుంది.

Read Also : OnePlus Summer Sale : మే 1 నుంచే వన్‌ప్లస్ సమ్మర్ సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లు, ప్యాడ్, బడ్స్ ప్రో, స్మార్ట్ వాచ్‌లపై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

ప్రస్తుతానికి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ, కొత్త లీక్ ప్రకారం.. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో ఎంపిక చేసిన మార్కెట్లలో శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ అందుబాటులో ఉంటుందని అంచనా. లీక్‌లను పరిశీలిస్తే.. శాంసంగ్ G ఫోల్డ్ డిస్‌ప్లే , సైజు, డిజైన్, ధరతో సహా కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించాయి.

శాంసంగ్ ట్రై-ఫోల్డ్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు (లీక్) :
ఇటీవలి లీక్‌ల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ పూర్తిగా ఓపెన్ చేసినప్పుడు 9.9-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చు. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ ఇన్నర్-ఫోల్డింగ్ మెకానిజంను కలిగి ఉంది. మెరుగైన మన్నిక కోసం డిస్‌ప్లే రెండు వైపులా లోపలికి ఫోల్డ్ అవుతుంది. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ 23W, 24W మధ్య వేగంతో ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.

శాంసంగ్ ట్రై ఫోల్డ్ ధర 3 రెట్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ G ఫోల్డ్ భారీ ధర ట్యాగ్‌తో వస్తుందని ఊహిస్తున్నారు. హువావే మేట్ XT లాంచ్ ధర దాదాపు 2,800 డాలర్లు (దాదాపు రూ. 2,38,345)కు సమానమైన ధరతో వచ్చే అవకాశం ఉంది.
శాంసంగ్ ట్రై-ఫోల్డ్ హ్యాండ్‌సెట్ హువావే మేట్ XT అల్టిమేట్‌కు పోటీగా ఉంటుందని చెబుతున్నారు. శాంసంగ్ ట్రై-ఫోల్డ్ డిస్‌ప్లేను కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్. రెండోది పూర్తిగా ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు 10.2-అంగుళాల లోపలి ఫోల్డబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Read Also : Indian Railways New Rule : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై ఇలా ప్రయాణించలేరు..!

6.4-అంగుళాల కవర్ స్క్రీన్‌తో ఎక్స్‌ట్రనల్ ఫోల్డబుల్ మెకానిజంను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 5,600mAh బ్యాటరీతో వస్తుంది. 66W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొదట సెప్టెంబర్ 2024లో చైనాలో లాంచ్ అయింది. ఇతర ఎంపిక చేసిన మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చింది.