Selling Used Phone : మీ పాత ఫోన్ అమ్మే ముందు ఈ 5 పనులు చేయకపోతే భారీగా నష్టపోతారు!

Selling Used Phone : పాత్ ఫోన్ అమ్మేందుకు చూస్తున్నారా? అయితే, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని అకౌంట్ల నుంచి తప్పనిసరిగా లాగౌట్ అవ్వండి.

Selling Used Phone

Selling Used Phone : మీ పాత ఫోన్ అమ్మాలని చూస్తున్నారా? వాడేసిన ఫోన్ అమ్మి కొత్త ఫోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే, జర జాగ్రత్త.. మీ పాత విషయంలో పొరపాటున కూడా ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. లేదంటే.. మీ డేటా రిస్క్ లో పడినట్టే.. అది ఎలా అంటారా? చాలామంది పాత స్మార్ట్‌ఫోన్‌ అమ్మే ముందు కేవలం ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటారు.

ఇక మన డేటా సేఫ్ అనుకుంటారు. వాస్తవానికి అది సరిపోదు. మీ వ్యక్తిగత డేటా, ఫోటోలు, బ్యాంకింగ్ డిటైల్స్, కాంటాక్ట్‌లు, ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఫోన్‌ను విక్రయించే ముందు డేటా భద్రతకు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలి..

ఫస్ట్ మీ ఫోన్‌లో ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోండి. ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, డాక్యుమెంట్లు, వాట్సాప్ చాట్స్, గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌లో సేఫ్‌గా పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే కొత్త ఫోన్‌కు డేటాను ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Read Also : Jio vs Airtel : ఒకే ధర.. 30 రోజుల వ్యాలిడిటీ! జియో, ఎయిర్‌టెల్‌లో బెనిఫిట్స్ ఒకటేనా? ఏది బెటర్?

అయితే మీ పాత ఫోన్‌లో ఇప్పటికే లాగిన్ అయి ఉంటే అన్ని అకౌంట్ల నుంచి తప్పనిసరిగా లాగౌట్ అవ్వండి. గూగుల్ అకౌంట్, ఆపిల్ ఐడీ, ఈమెయిల్, సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసేయండి. మీరు కొత్తవారికి మీ ఫోన్ అమ్మినా మీ డేటాను వాళ్లు యాక్సస్ చేసే అవకాశం ఉండదు.

ఆండ్రాయిడ్‌లో ‘Find My Device’, ఐఫోన్‌లో ‘Find My iPhone’ ఫీచర్లను ఆఫ్ చేయాలి. స్క్రీన్ లాక్, పాస్‌కోడ్, ఫింగర్‌ప్రింట్ వంటి సేఫ్టీ సెట్టింగ్స్ కూడా డిలీట్ చేయాలి. అంతేకాదు.. సిమ్ కార్డ్, మెమరీ కార్డ్‌ను ఫోన్ నుంచి రిమూవ్ చేయడం అసలు మర్చిపోవద్దు.

చివరగా పాత ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. అప్పుడు మీ ఫోన్‌ క్లీన్ రీసెట్ అవుతుంది. కొత్త యూజర్ కొత్త డివైజ్ మాదిరిగా వాడుకోవచ్చు. ఛార్జర్, బాక్స్, బిల్లు వంటి అప్లియన్సెస్ ఉంటే వాటిని కూడా ఇవ్వండి. తద్వారా మంచి ధరకు అమ్మేయొచ్చు. పాత ఫోన్ అమ్మకంలో ధర ఎంత ముఖ్యమో, డేటా సేఫ్టీ కూడా అంతే ముఖ్యం..