Ola Vs Simple One
Simple One Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అవకముందే పోటీపడి బుకింగ్‌లు చేసేసుకున్నారు. ఇప్పుడు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిందని తెలిసిందంతే. లుక్ చూశారో.. ఫీచర్లు తెలుసుకున్నారో.. కానీ, తమకే కావాలంటూ బుకింగ్ లు చేసుకునేందుకు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. కాకపోతే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ వెబ్ సైట్లో ఆగస్టు 15 నుంచి సాయంత్రం 5 గంటల తర్వాతే బుక్ చేసుకోవడం కుదురుతుంది. అది కూడా రూ. 1,947 ధరతోనే ప్రీ బుకింగ్ చేసుకోవాలి.
‘సింపుల్ వన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సృష్టించాలని ఆశిస్తున్నాం. చారిత్రాత్మక రోజైన ఆగస్టు 15 నుంచి ప్రీ బుకింగ్ మొదలవుతుంది’ అని కంపెనీ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుహాస్ రాజ్ కుమార్ వెల్లడించారు.
సింపుల్ వన్ లాంచింగ్.. ఓలా స్కూటర్, అథర్ 450ఎక్స్ లకు పోటీ ఖాయమే అనిపిస్తుంది.
* టచ్ స్క్ర్రీన్
* బ్లూటూత్ కనెక్టివిటీ
* ఆన్ బోర్డ్ నావిగేషన్ సపోర్ట్
* సింపుల్ వన్ ధర రూ.1లక్ష నుంచి రూ.లక్షా 20వేల వరకు
మొదటి దశలో సింపుల్ వన్ ను 13 రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. అలాగే, ఆగస్టు 15 రానున్న ఓలా స్కూటర్ ధర కూడా రూ.లక్షా 20వేల ఉండే అవకాశం ఉంది. దాదాపు సింపుల్ వన్ ఫీచర్లతో పోలిక ఉండటం ధర కూడా సమానంగా ఉండటంతో ఈ రెండిటి మధ్య పోటీ కామన్ అనిపిస్తుంది.