WhatsApp Users : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఫొటోలు, ఫైల్స్ పంపేందుకు ఇంటర్నెట్‌తో పనిలేదు..!

WhatsApp Users : మీడియా, డాక్యుమెంట్లను ఆఫ్‌లైన్‌లో షేర్ చేయడానికి యూజర్లను అనుమతించే ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు నివేదించింది.

WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇకపై ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా ఫైల్‌లను షేర్ చేసేందుకు వీలు కల్పించనుంది. ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్, డాక్యుమెంట్లను ఆఫ్‌లైన్‌లో షేర్ చేయడానికి యూజర్లను అనుమతించేలా మెసేజింగ్ యాప్ పనిచేస్తోందని ఇటీవలి లీక్‌లు వెల్లడించాయి. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే వివిధ రకాల ఫైల్‌లను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ ఈ ఫీచర్‌పై పనిచేస్తోందని నివేదిక పేర్కొంది. షేరింగ్ ఫైల్‌లు కూడా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. ఇతరులు యాక్సస్ చేయలేరు.

Read Also : Tech Star Shahrukh : ఈ సింపుల్ ట్రిక్‌తో దొంగలు కొట్టేసిన 2 ఫోన్లు భలే పట్టేశాడు.. నువ్వు సూపర్ బ్రో..!

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటా నుంచి లీక్ అయిన స్క్రీన్‌షాట్‌లను పరిశీలిస్తే.. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఈ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌కు సపోర్టు ఇచ్చేసమీపంలోని ఫోన్‌లను ఎంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ ప్రామాణిక సిస్టమ్ లోకల్ ఫైల్ షేరింగ్ బ్లూటూత్ ద్వారా సమీపంలోని డివైజ్‌లను స్కాన్ చేయడానికి యాప్‌లను అనుమతిస్తుంది. అయితే, యూజర్లు కావాలనుకుంటే ఈ యాక్సెస్‌ను ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది.

మీ డివైజ్‌కు సమీపంలోని డివైజ్‌లను కనుగొనడమే కాకుండా మీ ఫోన్‌లోని సిస్టమ్ ఫైల్స్, ఫొటో గ్యాలరీని యాక్సెస్ చేసేందుకు వాట్సాప్‌కు అనుమతి అవసరం. ఇతర డివైజ్‌లు కనెక్ట్ అయ్యేంత దగ్గరగా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి యాప్‌కి లోకల్ పర్మిషన్ కూడా అవసరం. ఈ అనుమతులు ఉన్నప్పటికీ.. వాట్సాప్ ఫోన్ నంబర్‌లను కనిపించకుండా చేస్తుంది. షేర్ చేసిన ఫైల్‌లను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. షేరింగ్ ప్రాసెస్ చాలా సేఫ్‌గా ఉంటుంది.

ఈ కొత్త ఫీచర్ ShareIT వంటి పీర్-టు-పీర్ ఫైల్ షేరింగ్ యాప్‌ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. సెల్యులార్ లేదా వై-ఫై కనెక్షన్ అవసరం లేకుండానే డివైజ్‌ల మధ్య ఫైల్‌లను షేర్ చేయడానికి ఈ యాప్‌ యూజర్లను అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్లు తరచుగా వివిధ రకాల మీడియా ఫైల్‌లు, డాక్యుమెంట్‌లను షేర్ చేస్తుంటే.. ఈ కొత్త ఫీచర్ యాప్‌కి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ఫీచర్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ ప్రకటించలేదు. అయితే, ఇప్పటికే బీటా టెస్టింగ్‌లో ఉంది. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫైల్ షేరింగ్‌ సురక్షితంగా చేసుకోవచ్చు.

Read Also : Reliance Jewels : అక్షయ తృతీయ వేడుకలు.. రిలయన్స్ జ్యువెల్స్ ‘వింధ్య కలెక్షన్’ ఆవిష్కరించిన దిశా పటానీ

ట్రెండింగ్ వార్తలు