Starlink India Launch
Starlink India Launch : అతి త్వరలో భారత్‌కు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ వచ్చేస్తోంది. ఎలన్ మస్క్ స్టార్ లింక్ సర్వీస్ కోసం భారత ప్రభుత్వం నుంచి ఇప్పటికే దాదాపు అన్ని అప్రూవల్స్ వచ్చేశాయి. ఇంకా కొన్ని అప్రూవల్స్ రావాల్సి ఉంది. స్టార్‌లింక్ రాకతో దేశంలో ఇంటర్నెట్ వినియోగించే విధానం చాలావరకు మారబోతోంది.
అయితే, చాలామందిలో భారత్‌లో స్టార్ లింక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? మార్కెట్లో ధర (Starlink India Launch) ఎంత ఉంటుంది? ఇంటర్నెట్ స్పీడ్ ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ స్టార్‌లింక్‌కు సంబంధించిన లీక్ అయిన పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత్‌లో స్టార్‌లింక్ లాంచ్ తేదీ, కనెక్షన్లపై లిమిట్ :
ప్రస్తుతానికి, స్టార్‌లింక్‌కు SATCOM గేట్‌వే, నెట్‌వర్క్ ఫోన్ల కోసం లైసెన్స్‌లు తప్ప దాదాపు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. వచ్చే త్రైమాసికంలో క్రమబద్ధీకరించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 2026 నుంచి స్టార్‌లింక్ సర్వీసులు అమలులోకి రావొచ్చు. కనెక్షన్ల విషయానికొస్తే.. మార్కెట్ బ్యాలెన్సింగ్ కోసం భారత ప్రభుత్వం దేశంలో రెండు మిలియన్ల కనెక్షన్‌ల పరిమితిని విధించింది.
స్టార్‌లింక్ సెటప్ ఖర్చు, ప్యాకేజీలు :
ధరల విషయానికి వస్తే.. భారత మార్కెట్లో స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీసు సెటప్ ఖర్చు దేశంలో దాదాపు రూ. 30వేలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ప్లాన్ల విషయానికి వస్తే.. ధర నెలకు రూ. 3,300 వరకు ఉండవచ్చు. అయితే, వివిధ ప్రాంతాల ఆధారంగా ధరల్లో మార్పులు ఉన్నాయి.
స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్ :
దేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు స్పీడ్ 25Mbps నుంచి 225Mbps వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు, ఈ సర్వీసు ముఖ్యంగా స్టేబుల్ నెట్‌వర్క్‌ను మారుమూల ప్రాంతాలకు చేరేలా అభివృద్ధి చేశారు. అందువల్ల పట్టణ ప్రాంతాల్లోని సాధారణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌తో పోలిస్తే.. స్లో స్పీడ్, అధిక ధరలు ఉంటాయి. రద్దీగా ఉండే నగరాలతో పోలిస్తే.. గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాలలో ఇదే ప్రభావం ఎక్కువగా ఉంటుంది.