Tata Cars Discounts
Tata Cars Discounts : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి టాటా సియెర్రా వచ్చేస్తోంది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సియెర్రా SUVని ఆవిష్కరించింది. ఈ కొత్త టాటా సియెర్రా అసలు మోడల్ కర్వ్డ్ గ్లాస్ మాదిరిగా విజువల్ ఎఫెక్ట్‌తో వస్తుంది. గ్లాస్ బ్లాక్ కలర్ ప్యానెల్‌తో పాటు భారీ రియర్ విండో, క్వార్టర్ గ్లాస్‌ను కలిగి ఉంటుంది.
సియెర్రా కారు ధరను కంపెనీ ప్రకటించలేదు. ఈ నవంబర్ 25న భారతీయ (Tata Cars Discounts) మార్కెట్లో లాంచ్ చేయనుంది. టాటా సియెర్రా SUV మోడల్ ఇతర ఆటో దిగ్గజ మోడల్స్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి మిడ్ రేంజ్ SUVలకు పోటీగా వస్తుంది. ICE ఫ్రంట్ సైడ్ సియెర్రా మొత్తం పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ అనే మూడు 1.5-లీటర్ ఇంజన్ ఆప్షన్లలో రానుంది.
ఈ టాటా సియెర్రా ఎంట్రీకి ముందే మార్కెట్లో టాటా కార్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. అనేక మోడల్ కార్లపై రూ. 1.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది. ఈ మోడళ్లలో హారియర్, సఫారీ, కర్వ్, ఆల్ట్రోజ్ కార్లు ఉన్నాయి. డీలర్‌షిప్‌ను బట్టి ఈ మోడళ్లపై బ్రాండ్ అందించే ఆఫర్‌లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. టాటా అందించే వివిధ మోడళ్లపై ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం..
టాటా హారియర్, సఫారీ :
టాటా హారియర్ సఫారీల కోసం మిడ్-స్పెక్ అడ్వెంచర్ ట్రిమ్‌లను రూ.1.75 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ స్మార్ట్ ట్రిమ్‌లపై రూ.50వేల వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే లో-స్పెక్ ప్యూర్ ట్రిమ్ మోడల్ కార్లు మొత్తం రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ పొందుతాయి.
మరోవైపు, హారియర్ ఫియర్‌లెస్ సఫారీ అకంప్లిష్డ్ మోడళ్లపై రూ.75వేల నుంచి రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ప్రమోషన్లు MY2024, MY2025 హారియర్ సఫారీ మోడళ్లకు వర్తిస్తాయి. హారియర్ ధర రూ.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుండగా సఫారీ ధర రూ.14.66 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి లభ్యమవుతుంది.
టాటా ఆల్ట్రోస్ :
ఈ నెలలో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా ఆల్ట్రోజ్ అన్ని వెర్షన్లు మొత్తం రూ. లక్ష బెనిఫిట్స్‌తో వస్తాయి. రేసర్ వేరియంట్ రూ. 1.35 లక్షల వరకు ఎక్కువ డిస్కౌంట్లను అందిస్తుంది. అదే సమయంలో, పెట్రోల్, సీఎన్‌జీ డీజిల్‌లో MY2025 ప్రీ-ఫేస్‌లిఫ్ట్ ఆల్ట్రోజ్ మోడల్స్ రూ. 65వేల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌పై ఈ నెలలో ఎలాంటి డిస్కౌంట్‌లు అందుబాటులో లేవు. ధరల వారీగా పరిశీలిస్తే ఆల్ట్రోజ్ రూ. 6.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.
టాటా నెక్సన్ :
టాటా నెక్సాన్‌పై (MY2024, MY2025) కారు మోడళ్లకు రూ. 45వేల వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. అదనంగా, MY2025 నెక్సాన్‌లకు రూ. 20వేల వరకు లాయల్టీ బోనస్ కూడా అందిస్తుంది. నెక్సాన్ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
టాటా టియాగో, టిగోర్ :
MY2024 స్టాక్‌పై టియాగో టిగోర్ వరుసగా రూ.40వేలు, రూ.45,000 వరకు ఆఫర్లను అందిస్తున్నాయి. అదే సమయంలో, MY2025 టియాగో (బేస్ XE ట్రిమ్ మినహా) టిగోర్స్ వరుసగా రూ.25వేలు నుంచి రూ.30వేలు మొత్తం బెనిఫిట్స్ పొందవచ్చు. టియాగో రూ.4.57 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కాగా టిగోర్ రూ.5.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
టాటా పంచ్ :
టాటా అతి చిన్న SUV పంచ్ మోడల్ MY2024 స్టాక్‌పై రూ. 25వేల వరకు క్యాష్ డిస్కౌంట్లు లభిస్తుండగా, MY2025 మోడల్స్ మొత్తం రూ. 40వేల వరకు క్యాష్, లాయల్టీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తున్నాయి. టాటా పంచ్ ధరలు రూ. 5.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
టాటా కర్వ్ :
2024లో తయారైన టాటా కర్వ్ అన్ని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లపై రూ. 30వేల వరకు క్యాష్ డిస్కౌంట్లను అందిస్తుంది. MY2025 యూనిట్లు రూ. 40వేల వరకు డిస్కౌంట్‌లతో వస్తాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. కూపే-ఎస్‌యూవీ ధరలు రూ. 9.66 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.