How to track stolen iPhone or Android smartphone
Lost SmartPhone : ఏంటి.. మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? ఎవరైనా మీ ఫోన్ దొంగిలించారా? అయితే మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు.. ఎన్నో వేలు పోసి నచ్చిన మోడల్ స్మార్ట్ ఫోన్ కొనేస్తుంటారు. అలాంటి స్మార్ట్ ఫోన్ పోయిందంటే ఎవరైనా బాధపడకుండా ఉండలేరు. పొగట్టుకున్న స్మార్ట్ ఫోన్ మళ్లీ దొరుకుతుందా? అంటే చెప్పడం కష్టమే. కానీ, ప్రస్తుత టెక్నాలజీ ద్వారా పోయిన స్మార్ట్ ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు. అయితే మీ ఫోన్ పోయిన వెంటనే ముందుగా ఎవరైనా ఏం చేస్తారు.. పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. లేదంటే.. ఫైండ్ మై ఫోన్ అనే టెక్ టిప్స్ ద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు.
ఒకవేళ మీరు మీ పోయిన ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ డివైజ్ ఏదైనా కావొచ్చు.. మీరు మీ ఫోన్ ఎక్కడ ఉన్నా క్షణాల వ్యవధిలో కనిపెట్టవచ్చు. అయినప్పటికీ మీరు మీ స్మార్ట్ ఫోన్ ట్రాక్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే.. దొంగిలించిన స్మార్ట్ ఫోన్ ఎలా ట్రాక్ చేయాలో ఇప్పుడు మీకు పూర్తి వివరాలను అందిస్తున్నాం.. అంటే.. దొంగిలించిన స్మార్ట్‌ఫోన్‌ను భారత ప్రభుత్వ పోర్టల్ (CEIR) ద్వారా ఎలా ట్రాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంతకీ సీఈఐఆర్ (CEIR) అంటే.. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ నకిలీ మొబైల్ ఫోన్ మార్కెట్‌ను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. కేవలం మీ డేటాతో సంబంధం కలిగి ఉంటుంది. మీ డేటా లేదా మీ పేరుతో రిజిస్టర్ అయిన ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ప్రైవసీపరంగా ఇబ్బందుల్లో పడినట్టే. అలాంటి బాధితులు ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉన్నా ఈజీగా ట్రాక్ చేయడంలో మీకు సాయపడుతుంది. ముఖ్యంగా, ఈ డివైజ్‌లో SIM ఎవరైనా మార్చినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు.
CEIR ఎలా ఉపయోగించాలి?
సీఈఐఆర్ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం చాలా సులభం. మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే.. సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో బ్లాక్ ఆప్షన్ ఉపయోగించండి. మీరు ఈ ఆప్షన్ ఎంచుకుంటే.. మీ మొబైల్ నంబర్, IMEI నంబర్, మోడల్ వంటి ఇతర సంబంధిత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫారమ్‌ను సబ్మిట్ చేసేందుకు మీకు పోలీసు ఫిర్యాదు నంబర్ (FIR) అవసరమని స్మార్ట్ ఫోన్ యూజర్లు తప్పక గుర్తుంచుకోవాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది. అలా మీ ఫోన్ కనిపెట్టి బ్లాక్ చేయవచ్చు.
ఆ తర్వాత మీకు ఫోన్ దొరికితే ఏం చేయాలంటే.. చాలా సులభం.. మీ ఫోన్ అన్‌బ్లాక్ ఎంపిక ఆప్షన్ కూడా ఉంది. దానిపై క్లిక్ చేసి, కంప్లయింట్ ఐడీ, ఇతర వివరాలను సమర్పించండి. ఈ పద్ధతి ద్వారా మీరు మీకు మళ్లీ దొరికిన స్మార్ట్‌ఫోన్‌కు యాక్సెస్‌ను ఈజీగా అన్‌లాక్ చేయవచ్చు. దొంగిలించిన స్మార్ట్‌ఫోన్ స్టేటస్ చూడాలంటే ‘Check request status’ ఆప్షన్ కూడా ఉంది.
ఈ టెక్ టిప్స్ తప్పక ఫాలో అవ్వండి :
దొంగిలించిన స్మార్ట్‌ఫోన్‌లను ట్రాక్ చేయడంతో పాటు మానిటరింగ్ చేయడం ఎలాగో ఇప్పుడు మీకు తెలుసుకున్నారు. ముందుగా.. మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్‌ని కొనుగోలు చేస్తే.. దొంగిలించిన ఫోన్ అవునా కాదో ఎలా చెక్ చేయాలో తెలుసా? అందుకు మీకు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి మీరు 14422కి కేవైఎమ్ తర్వాత IMEI నంబర్ అని మెసేజ్ పంపవచ్చు. ఈ ఫోన్ నిజమైనదైతే.. మీ ఫోన్ గురించి డేటాతో కూడిన మెసేజ్ మీకు వస్తుంది. బ్లాక్‌లిస్ట్ అని మీకు మెసేజ్ వస్తే.. ఆ ఫోన్ వాడొద్దు.
ఎందుకంటే అది దొంగిలించిన ఫోన్ అయి ఉండవచ్చు. అందుకు మీరు మరింత డేటాను పొందడానికి గూగుల్ ప్లే, ఆపిల్ స్టోర్‌లో (KYM APP) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు IMEI నంబర్‌ను గుర్తుపెట్టలేకపోతే.. డేటా సెట్టింగ్‌ల యాప్‌లో అందుబాటులో ఉంటుంది. లేదంటే.. *#06# అని మీకు దొరికిన ఫోన్‌లో డయల్ చేయండి. IMEI Number స్మార్ట్‌ఫోన్ బాక్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. IMEI నంబర్‌ను నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకోవడం మరిచిపోవద్దు. మీ ఫోన్‌లో డిలీట్ అయిన ఫైల్‌లను తిరిగి పొందాలంటే క్లౌడ్ స్టోరేజ్లే లేదా హార్డ్ డ్రైవ్‌లో ఫైల్‌లను బ్యాకప్ చేసుకోవాలి.