Tech Tips in Telugu _ How to translate emails on Gmail mobile app
Tech Tips in Telugu : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో జీమెయిల్ ఒకటి. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో (Gmail) మొబైల్ యాప్ ఇప్పుడు యాప్‌లో నేరుగా ఇమెయిల్‌లను ట్రాన్స్‌లేట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఇంతకుముందు, ఈ ఫీచర్ జీమెయిల్ వెబ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లకు అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. జీమెయిల్ యూజర్లు వెబ్‌లోని జీమెయిల్ యాప్‌లో ఇమెయిల్‌లను 100కి పైగా భాషలకు సౌకర్యవంతంగా ట్రాన్స్‌లేట్ చేసుకునే వీలుంది. ఇప్పటినుంచి జీమెయిల్ మొబైల్ యాప్‌లో లోకల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. విస్తృత శ్రేణి భాషలలో సజావుగా కమ్యూనికేట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
ఈ ఫీచర్ యూజర్లకు సాయం చేసేందుకు వీలుగా భాషలో మీరు ఇమెయిల్‌లను స్వీకరిస్తే మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో జీమెయిల్ యాప్ ఇమెయిల్ కంటెంట్ భాషను ఆటోమాటిక్‌గా గుర్తిస్తుంది. ఇమెయిల్ టాప్‌లో బ్యానర్‌ను ప్రదర్శిస్తుంది. యూజర్ ఇష్టపడే భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసేందుకు ఆఫర్ చేస్తుంది. ఇమెయిల్ స్పానిష్‌లో ఉన్నా యూజర్ భాష ఆంగ్లంలో ఉంటే.. ట్రాన్స్‌లేట్ టెక్స్ట్ చూడటానికి ‘Translate to English’పై నొక్కండి. ఈ ఫీచర్ యూజర్లకు సాయం చేసేలా ఉంటుంది. వినియోగదారులు తెలియని భాషలో ఇమెయిల్‌లను స్వీకరించినప్పుడు భాషతో పరిచయం లేకపోయినా అసలు భాషలో ఇమెయిల్‌ను చదవాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జీమెయిల్ యాప్‌లో ఇమెయిల్‌ను ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలంటే? :
* Gmail యాప్‌ని ఓపెన్ చేసి ట్రాన్స్‌లేట్ చేసే ఇమెయిల్‌ను ఓపెన్ చేయండి.
* ఇమెయిల్ రైట్ టాప్ కార్నర్‌లో త్రి డాట్స్‌పై నొక్కండి.
* ట్రాన్సులేట్ ఎంచుకోండి.
* మీరు ఇమెయిల్‌లో ట్రాన్స్‌లేట్ లాంగ్వేజీని ఎంచుకోండి.
* ఇమెయిల్ ట్రాన్స్‌లేట్ అవుతుంది.
* కొత్త భాషలో డిస్‌ప్లే అవుతుంది.
Tech Tips in Telugu _ How to translate emails on Gmail mobile app
మీరు ట్రాన్స్‌లేట్ ఆప్షన్ తీసివేస్తే.. ఇమెయిల్ కంటెంట్ మీ సెట్ భాషకు భిన్నంగా ఉందని యాప్ గుర్తించినప్పుడు మళ్లీ కనిపిస్తుంది. మీరు ట్రాన్స్‌లేట్ బ్యానర్‌ను కూడా ఆఫ్ చేయవచ్చు. నిర్దిష్ట భాష కోసం ట్రాన్స్‌లేట్ బ్యానర్‌ను ఆఫ్ చేయడానికి మీరు బ్యానర్‌ను తీసివేసినప్పుడు కనిపించే లాంగ్వేజీ మళ్లీ ట్రాన్స్‌లేట్ అంటూ ప్రాంప్ట్ కనిపిస్తుంది. సిస్టమ్ మరొక లాంగ్వేజీని గుర్తించడంలో విఫలమైతే, మీరు త్రి డాట్స్ మెనులో కనిపించే ఆప్షన్ ఉపయోగించి ఇమెయిల్‌ను మాన్యువల్‌గా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త జీమెయిల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్ ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని అదనపు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రాన్స్‌లేట్ ఫంక్షనాలిటీ ప్రస్తుతం బీటా స్టేజీలో మాత్రమే ఉంది. అంటే.. ట్రాన్స్‌లేట్ కంటెంట్‌లో అప్పుడప్పుడు తప్పులు లేదా లోపాలు ఉండవచ్చు. ట్రాన్స్‌లేట్ పూర్తిగా కచ్చితమైనది కాదని గుర్తుంచుకోండి. ఈ ఫీచర్ మిమ్మల్ని ఒకేసారి ఒక ఇమెయిల్‌ను మాత్రమే ట్రాన్స్‌లేట్ చేయడానికి అనుమతిస్తుంది. మీకు విదేశీ భాషలో మల్టీ ఇమెయిల్‌లు ఉంటే.. వాటిని ఒక్కొక్కటిగా ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఫీచర్ క్రమంగా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. మీకు మీ జీమెయిల్ యాప్‌లో ఫీచర్ కనిపించకపోతే.. యాప్‌ను అప్‌డేట్ చేయండి లేదా కొన్ని వారాలు వేచి ఉండండి.