Tecno Pova 8 Pro 5G : ఫీచర్లు మాత్రం కిర్రాక్.. కొత్త టెక్నో పోవా 8 ప్రో 5G వస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్!
Tecno Pova 8 Pro 5G : టెక్నో పోవా 8 ప్రో 5జీ వస్తోందోచ్.. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- August 13, 2026 / 07:40 PM IST
Tecno Pova 8 Pro 5G
- మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్‌సెట్
- ఆగష్టు 18న భారత మార్కెట్లో లాంచ్ కానుంది
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా
Tecno Pova 8 Pro 5G : కొత్త టెక్నో ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి టెక్నో కంపెనీ పోవా 8 ప్రో 5జీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ సెకండరీ డిస్‌ప్లే ఉంటుంది. పోవా 8 ప్రో 5జీ ఇంటర్నేషనల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది.
ఆగస్టు 18నే లాంచ్ :
పోవా 8 ప్రో 5జీ ఫోన్ ఆగస్టు 18న భారత మార్కెట్లో లాంచ్ కానుందని టెక్నో ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్‌తో పాటు అలైవ్ మ్యాట్రిక్స్ సెకండరీ డిస్‌ప్లే ఉంటుంది. పోవా 8 ప్రో 5Gలో రైట్ సైడ్ కొత్త ఆరెంజ్ బటన్ కూడా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెక్నో అంతర్జాతీయ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. ఈ లిస్టులో పోవా 8 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, కలర్ ఆప్షన్లు వివరాలు ఉన్నాయి. ఈ పోవా ఫోన్ అంతర్జాతీయ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్ 2.6Hz టాప్ క్లాక్ స్పీడ్‌తో వస్తుంది. పోవా 8 ప్రో 5జీ ఆర్క్ వైట్, టండ్రా గ్రీన్ గ్రాఫైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS16పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్మ్ మాలి-G615 MC2 జీపీయూ అమర్చారు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో పాటు 12GB + 256GB, 12GB + 512GB వేరియంట్లలో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నేషనల్ వేరియంట్ 6.78-అంగుళాల (1,208 x 2,644 పిక్సెల్స్) హైపర్‌లక్స్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్, 429ppi పిక్సెల్ డెన్సిటీ 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ అందిస్తుంది.
కెమెరా ఫీచర్లు (అంచనా) :
పోవా 8 ప్రో 5జీ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 162.48 x 77.27 x 7.39mm, బరువు సుమారుగా 189 గ్రాములు ఉంటుంది.
