Honor Magic 9 Series : శాంసంగ్, వివో, షావోమీకి గట్టి పోటీ.. హానర్ మ్యాజిక్ 9 సిరీస్ వచ్చేస్తోంది.. 200MP ప్రైమరీ కెమెరా కేక..!
Honor Magic 9 Series : హానర్ నుంచి కొత్త సిరీస్ వచ్చేస్తోంది. 200MP ప్రైమరీ కెమెరాతో హానర్ మ్యాజిక్ 9 సిరీస్ రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం జర్మన్ ఇమేజింగ్ సంస్థ ARRIతో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Honor Magic 9 Series
- కొత్త హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో మొత్తం 3 మోడళ్లు
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్సెట్ ఆప్షన్
- ఏఐ ఫీచర్లు, 200MP ప్రైమరీ కెమెరా సెటప్
Honor Magic 9 Series : హానర్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ సిరీస్ రాబోతుంది. చైనా ఫోన్ మేకర్ హానర్ వచ్చే నెలలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 9, హానర్ మ్యాజిక్ 9 ప్రో, హానర్ మ్యాజిక్ 9 ప్రో మాక్స్ అనే 3 మోడళ్లు ఉంటాయని అంచనా. ఈ సిరీస్‌లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉండొచ్చు.
అయితే, హానర్ సీఈఓ లీ జియాన్ సెప్టెంబర్ 28న జరగబోయే హానర్ రోబోట్ ఫోన్ లాంచ్ ఈవెంట్లో కొత్త హానర్ మ్యాజిక్ 9 సిరీస్ లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించారు. ఈ స్మార్ట్ఫోన్లు క్వాల్కామ్ నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్సెట్తో రన్ అవుతాయని అంచనా.
హానర్ మ్యాజిక్ 9 సిరీస్ ఫీచర్లు (అంచనా) :
టిప్‌స్టర్ ప్రకారం.. హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా ఉండొచ్చు. ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు.
హానర్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం జర్మన్ ఇమేజింగ్ సంస్థ (ARRI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా ఫొటోగ్రఫీ వీడియో రికార్డింగ్ కోసం ARRI LogC3, ARRI Look, ARRI Movie Mode వంటి ఫీచర్లు రావచ్చు.
Read Also : LPG Gas Subsidy : కొత్త LPG గ్యాస్ కనెక్షన్ కావాలా? PMUYతో సబ్సిడీ గ్యాస్.. అప్లై చేసే ఫుల్ ప్రాసెస్ ఇదే!
హానర్ రోబోట్ ఫోన్ కోసం కూడా హానర్‌తో ARRI భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో పైభాగంలో రోబోటిక్ గింబల్ కెమెరా ఉంది. వీడియో రికార్డింగ్ కోసం సబ్జెక్టులను ట్రాకింగ్ కోసం రొటేట్ అవుతుంది.
ఇందులో త్రీ-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 2.7x ఆప్టికల్ జూమ్ 200x డిజిటల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 122-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా కూడా ఉంది.
నివేదికల ప్రకారం.. :
హానర్ మ్యాజిక్ 9 సిరీస్‌లో స్టైలస్ యాక్సెసరీ ఉంటుందని అంచనా. ఈ స్టైలస్ ఫీచర్ ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుంది. అంటే.. స్మార్ట్ డిజిటల్ పెన్ కావచ్చు. హానర్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు ఇప్పటికే స్టైలస్ ద్వారా ఇన్పుట్కు సపోర్టు ఇస్తున్నాయి. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్లో వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు 8,000 mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సేఫ్టీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండొచ్చు.
