×
Ad

చిన్నారుల కోసం 5 బెస్ట్ ల్యాప్ టాప్‌లు.. స్కూల్లో ఆన్‌లైన్ క్లాసులు వినొచ్చు, ఆటలు ఆడుకోవచ్చు!

  • Publish Date - August 15, 2020 / 09:09 PM IST

కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా నెలల తరబడి స్కూళ్లు కాలేజీలన్నీ మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి ఇప్పటివరకూ స్కూళ్లు తెరవలేదు..అప్పటినుంచి చిన్నారుల ఇళ్లకే పరిమితయ్యారు.. చిన్నారుల విద్యాసంవత్సరం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశాయి.. చిన్నారులకు డిజిటల్ క్లాసులు నిర్వహించేందుకు అనుమతినిచ్చాయి..

స్కూళ్లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లోనే ఉండి పిల్లలు తమ తల్లిదండ్రుల ఫోన్లు, ల్యాప్ టాప్ ల్లో ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నారు.. ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలు చదువు కోసం ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.. ల్యాప్ టాప్ ల వినియోగం ఎక్కువ పెరగడంతో చాలా కంపెనీలు చిన్నారుల కోసం ప్రత్యేకంగా కొన్ని ల్యాప్ టాప్ లను అందిస్తున్నాయి.



పిల్లల వాడే ల్యాప్ టాప్ ల్లో ప్రత్యేకించి.. లాంగ్ లైఫ్ బ్యాటరీతో పాటు స్పెషల్ స్పెషిఫికేషన్లు కూడా ఉండాలి. ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్‌లు, బ్రౌజర్‌లు పేరంట్స్ కంట్రోల్స్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. హోమ్ నెట్‌వర్క్‌లో రౌటర్లలో డివైజ్ ల లిమిట్ కూడా సెట్ చేసే సెట్టింగ్స్ ఉంటాయి. అన్నింటి కంటే.. అత్యుత్తమ ల్యాప్ టాప్.. లెనోవా Chromebook డ్యూయెట్. ఇది సరసమైన ధరకే అందుబాటులో ఉంది.. 2-ఇన్ -1 క్రోమ్‌బుక్.. ఇందులో డ్రాయింగ్, స్కెచింగ్ కోసం పెన్‌ కూడా ఉంది..

ఈ ల్యాప్‌టాప్‌లతో కేవలం పిల్లల చదువు కోసమే కాదు.. ఆటల కోసం కూడా ఎన్నో బెస్ట్ ల్యాప్ టాప్‌లు అందుబాటులో ఉన్నాయి.. అందులో చిన్నారుల కోసం తక్కువ ధరకే 5 బెస్ట్ ల్యాప్ టాప్ లను అందిస్తున్నాం.. ఆన్ లైన్ క్లాసులు వినొచ్చు.. బొమ్మలు గీయొచ్చు.. ఆటలు కూడా ఆడుకోవచ్చు… ఇంకెందుకు ఆలస్యం.. ఇందులో మీకు నచ్చిన ల్యాప్ ట్యాప్ సొంతం చేసుకోవచ్చు.. అవేంటో ఓసారి చూడండి..

1. Lenovo Chromebook Duet :
లెనోవా క్రోమ్‌బుక్ డ్యూయెట్.. 2-ఇన్ -1 ల్యాప్‌టాప్. దీని స్క్రీన్ 10.1-అంగుళాల 1080p IPS డిస్ ప్లే ఉంటుంది. ఇతర ల్యాప్‌టాప్‌ల కంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది. కీబోర్డ్ పూర్తిగా వేరు చేయొచ్చు.. దీని స్క్రీన్‌ను టాబ్లెట్‌గా వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఎంటర్ టైన్మెంట్, మల్టీమీడియా ప్లాట్‌ఫామ్‌గా డబుల్ డ్యూటీ చేయవచ్చు. మీరు పెన్ను ఎంచుకుంటే, డ్యూయెట్ పూర్తి డ్రాయింగ్ స్లేట్ అవుతుంది. స్కెచింగ్ లేదా నోట్ టేకింగ్ కోసం ఉపయోగించవచ్చు.



టాబ్లెట్ పౌండ్ మాత్రమే టాబ్లెట్ ప్లస్ కీబోర్డ్ రెండు పౌండ్లు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఈ ల్యాప్ టాప్ ప్రాసెసర్ సరిపోతుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. ఛార్జింగ్, డేటా బదిలీ కోసం USB-C పోర్ట్ ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా ఆకట్టుకుంటుంది. 10-11 గంటల వరకు ఉంటుంది. వాల్ మార్ట్ లో దీని ధర 310 (రూ. 23,204.96) డాలర్లకు అందుబాటులో ఉంది.

2. ASUS Chromebook C202SA-YS02 11.6 :
ఆసుస్ క్రోమ్‌బుక్ C202 ల్యాప్‌టాప్.. ఇందులో రబ్బరు గార్డు ఉంది. మొత్తం ల్యాప్‌టాప్ చుట్టూ తిరుగుతుంది. స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్ అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. 2.65 పౌండ్ల బరువు ఉంటుంది.. 10 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

C202 ఇంటెల్ సెలెరాన్ N3060 ప్రాసెసర్, 16GB స్టోరేజ్, 4GB ర్యామ్, 11.6-అంగుళాల 1366 x 768 యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా, Chromebook ల్యాప్ టాప్‌కు ఇతర కంప్యూటర్ల నుంచి వచ్చే వైరస్‌లతో ఇబ్బందులు ఉండవు. పేరంట్స్ కంట్రోల్స్ ఉంటాయి.. కొన్ని వెబ్‌సైట్‌లను పిల్లలు చూడకుండా కంట్రోల్ చేయొచ్చు. స్క్రీన్ టైమ్ లిమిట్ కూడా ఉంది.

3. Microsoft Surface Go 2 :
ఈ ల్యాప్‌టాప్ తేలికైన పోర్టబుల్ విండోస్ 10S ల్యాప్‌టాప్. కేవలం 1.2 పౌండ్ల బరువును కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ ఎక్కడైనా సులభంగా క్యారీ చేయొచ్చు. సర్ఫేస్ పెన్‌తో వస్తుంది.. అంటే ల్యాప్‌టాప్ నుండి పోర్టబుల్ టాబ్లెట్‌కు డ్రాయింగ్ స్లేట్‌కు త్వరగా సులభంగా మారవచ్చు. హ్యాండ్ రైటింగ్ గుర్తిస్తుంది..



నోట్ టేకింగ్ ఫీచర్లు పాఠశాలకు వెళ్లే పిల్లలకు ప్రత్యేకంగా ఉంటాయి. 10.5-అంగుళాల స్క్రీన్ కొద్దిగా చిన్నగా ఉంటుంది. 1920×1280 ప్యానెల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రాసెసర్ చాలా పనులకు సరిపోతుంది. పవర్ ఫుల్ స్పెషిఫికేషన్ల మంచి నమూనాలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎక్కువ ఖర్చు అవుతాయి. బ్యాటరీ కనీసం 10 గంటలు ఉంటుంది. అమెజాన్ లో దీని ధర 549 (రూ.41,095.23) డాలర్లకు అందుబాటులో ఉంది.

4. Apple MacBook Air :
మాక్‌బుక్స్ ఎల్లప్పుడూ టాప్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. కొత్త 2018 మాక్‌బుక్ ఎయిర్ హై ప్రాసెసింగ్ శక్తిని చిన్న ప్యాకేజీలో అందిస్తుంది. ఈ మోడల్ 2.75 పౌండ్ల బరువు, సన్నని పాయింట్ వద్ద 0.16 అంగుళాలు.. 2018 మాక్ ఎయిర్‌లో 1.6GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3.6GHz టర్బో బూస్ట్, 8GB RAM,128GB లేదా 256GB SSD ఉన్నాయి. గరిష్టంగా 1.5TB అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. 2560×1600 రిజల్యూషన్ 4 మిలియన్ పిక్సెల్స్ 48శాతం కలర్ అందిస్తుంది. 12 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.



100% రీసైకిల్ అల్యూమినియంతో మొదటి మాక్ కంప్యూటర్ ఎయిర్‌కు ట్రాక్‌ప్యాడ్ 20% పెద్దదిగా ఉంటుంది. ‘మౌస్’ కంట్రోల్ కూడా సున్నితంగా ఉంటుంది. మెరుగైన ఎయిర్ దాని కొత్త టచ్ ఐడి సెన్సార్‌ను కలిగి ఉంది. మీ వేలిని నొక్కడం ద్వారా మీ డివైజ్‌లోకి అన్‌లాక్ చేస్తుంది. వాల్ మార్ట్ లో దీని ధర 549 (రూ. 32,112.67) డాలర్లకు అందుబాటులో ఉంది.

5. Lenovo Ideapad 100S :
లెనోవా ఐడియాప్యాడ్ 100s ల్యాప్‌టాప్ పిల్లల ల్యాప్‌టాప్ కేటిగిరీలో తల్లిదండ్రులు ఇష్టపడతారు. 100s 11.6- అంగుళాల 1366×768 డిస్‌ప్లే, 2GB ర్యామ్, ఇంటెల్ అటామ్ ప్రాసెసర్, 32GB IMMC మెమరీని అందిస్తుంది. బరువు 2.2 పౌండ్లు, 69 అంగుళాలు సన్నగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్‌లో కేవలం 10 గంటలలోపు ప్యాక్ అందిస్తుంది. 32GB eMMC స్టోరేజీ మొత్తం సంగీతం లేదా వీడియో డౌన్‌లోడ్‌లను అనుమతించదు.



విండోస్ 10 ఆఫీస్ సపోర్టుతో పిల్లలకు పాఠశాల పనిలో ఇబ్బంది ఉండదు. మీరు చవకైన మైక్రో SD కార్డ్ కొనుగోలుతో అదనపు స్టోరేజీ (64GBవరకు) యాడ్ చేయొచ్చు. ఇతర విండోస్ 10 మోడళ్ల మాదిరిగానే, మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ పోర్టల్ ఆన్-బోర్డులో ఉంది. అలాగే ఏవైనా డౌన్‌లోడ్‌లను కంట్రోల్ చేయొచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు ల్యాప్‌టాప్‌ను ఎప్పటివరకూ వాడాలో  టైమర్‌ను కూడా సెట్ చేయవచ్చు. అమెజాన్ లో దీని ధర 480 (రూ.35,930.26) డాలర్లకు అందుబాటులో ఉంది.

పిల్లల కోసం ఎలాంటి ల్యాప్‌టాప్‌లో అవసరం :

మన్నిక : పిల్లల కోసం ల్యాప్‌టాప్ కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.. ఎందుకంటే పెద్దల కంటే పిల్లలు కొంచెం సున్నితంగా ఉంటారు.. ఎలక్ట్రానిక్ విషయంలో పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువ కాలం మన్నిక ఉండే ల్యాప్ టాప్ లు అవసరం.. సైజు, బరువు చూసుకోవాలి. చిన్న పిల్లలకు భారీ ల్యాప్‌టాప్‌ను పెద్దగా సౌకర్యవంతంగా ఉండదు. ప్రీ-టీనేజ్ కోసం 11-అంగుళాల పరిధిలో ల్యాప్‌టాప్‌తో టీనేజర్ల కోసం 13 అంగుళాల లేదా 14-అంగుళాల పరిధి లోబడి ఉండాలి.



పేరంట్ కంట్రోల్ :
మీ పిల్లలకి ఇంటర్నెట్‌కు యాక్సస్ ఇచ్చేటప్పుడు కాస్తా ఆలోచించాలి.. పేరంట్ కంట్రోల్స్ ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి. మీ పిల్లవాడు ఇంటర్నెట్ మాయా జాలంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. పాఠశాల తరగతులకు అవసరమైన టూల్స్ అందించడానికి మాత్రమే అనుమతించాలి. Chrome books బాగుంటాయి.. ఎందుకంటే మీరు ప్రమాదకరమైన సైట్‌లను లాక్ చేయడానికి అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చు. వైరస్లను నివారించడంలో సాయపడుతుంది.

స్కూల్ వర్క్ సౌకర్యంగా : మీ పిల్లవాడు పాఠశాల కోసం ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తుంటే.. తరగతి గదిలో వారు ఎలాంటి కంప్యూటర్లను ఉపయోగిస్తారో చెక్ చేయండి మీకు లభించే ల్యాప్‌టాప్ సౌకర్యంగా ఉందో లేదో చెక్ చేసుకోండి.