Battery Charging Trick : మీ ఫోన్, ల్యాప్‌టాప్ ఇలా చార్జ్ చేయండి.. బ్యాటరీ లైఫ్‌టైమ్ ట్రిక్.. ఓసారి ట్రై చేయండి!

మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్.. ఏదైనా డివైజ్ కావొచ్చు.. బ్యాటరీ చార్జింగ్ వెంటనే దిగిపోతుందా? ఎందుకిలా జరుగుతుందో తెలుసా? మీరు చార్జింగ్ చేసే విధానం వల్లే ఈ డివైజ్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందంటే నమ్ముతారా? అవును ఇది నిజం..

Best Way To Charge Your Device Will Make Its Battery Last Longer

Battery Charging Trick : మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్.. ఏదైనా డివైజ్ కావొచ్చు.. బ్యాటరీ చార్జింగ్ వెంటనే దిగిపోతుందా? ఎందుకిలా జరుగుతుందో తెలుసా? మీరు చార్జింగ్ చేసే విధానం వల్లే ఈ డివైజ్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందంటే నమ్ముతారా? అవును ఇది నిజం.. అసలు ఇందుకు ఇలా బ్యాటరీ వెంటనే డౌన్ అవుతాయో ఓసారి తెలుసుకుందాం.. సాధారణంగా మనం వాడే డివైజ్ ల్లో లిథియం ఐయాన్ (Lithium-ion Battery) బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ సామర్థ్యం ఏడాదిన్నరలో 500 సైకిల్స్ ఉత్పత్తి చేస్తుంది. అంటే.. ఒక బ్యాటరీ సైకిల్.. ఒక ఫుల్ చార్జింగ్ (0-100) పూర్తి అయితే ఒక సైకిల్ పూర్తి అయినట్టు. ఇలా ఫుల్ సైకిల్స్ ఎక్కువగా పెరిగినప్పుడు బ్యాటరీ లైఫ్ సైకిల్ మారిపోతుంది. తద్వారా బ్యాటరీ క్రమంగా డౌన్ అయి లైఫ్ టైమ్ తగ్గిపోతూ వస్తుంది.

ఇలా కాకుండా బ్యాటరీ లైఫ్ (Battery Lifetime) పెంచుకోవాలంటే ఒక బెస్ట్ మెథడ్ ఫాలో (Best Charging Method)  కావాలంటున్నారు టెక్ నిపుణులు. మీరు చార్జింగ్ చేసే విధానంలో కూడా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. మీ డివైజ్ బ్యాటరీ ఎప్పుడూ కూడా ఫుల్ సైకిల్ ఛార్జింగ్ చేయొద్దని సూచిస్తున్నారు. లైఫ్ సైకిల్ తగ్గకుండా ఉండాలంటే… బ్యాటరీ ఎప్పుడూ 25 శాతం నుంచి 85 శాతం మాత్రమే చార్జింగ్ చేయాలి. మీ ఫోన్ చార్జ్ 100 శాతం పూర్తి అయితే.. అది బ్యాటరీ (Lithium-ion batteries) హెల్త్ ను దెబ్బతీస్తుందని అంటున్నారు. అందుకే.. ఈ ట్రిక్.. ఫాలో అవ్వండి.. మీ ఫోన్ చార్జింగ్ ఎప్పుడూ కూడా పూర్తిగా జీరో అయ్యేంతవరకు ఉండొద్దు. చార్జింగ్ పెట్టినప్పుడల్లా 85 శాతం వరకు చార్జ్ అయితే చాలు.. వెంటనే ఆపేయండి.

ఒకవేళ మీ డివైజ్ పూర్తిగా చార్జ్ అయితే.. వెంటనే చార్జింగ్ ఆపేయండి. అలానే ప్లగ్ ఉంచి వదిలేయొద్దు. ఇలా తరచూ చేస్తూ ఉంటే.. మీ డివైజ్ బ్యాటరీ లైఫ్ క్రమంగా తగ్గిపోతుందని గుర్తించుకోండి. మీ డివైజ్ స్ర్కీన్ బ్రైట్ నెస్ (screen brightness) కూడా తగ్గించుకోండి. మీరు వాడని ఫీచర్లలో లొకేషన్ వంటి ఏమైనా ఉంటే వెంటనే డిజేబుల్ చేసేయండి. కొన్ని నిర్దిష్ట యాప్స్, నోటిఫికేషన్లను కూడా డిజేబుల్ చేయండి. వీటికి కూడా కొద్ది మొత్తంలో పవర్ ఖర్చు అవుతుంది. ఇలా చేయడం ద్వారా మీ డివైజ్ బ్యాటరీ లైఫ్ ను మరింత పెంచుకోవచ్చునని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మరోవిషయం.. రాత్రంతా ఎప్పుడూ కూడా మీ డివైజ్ చార్జింగ్ పెట్టి ఉంచరాదు. ఈ గైడ్ లైన్స్ పాటిస్తే.. మీ బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.