Thomson Smart TV : 108W ఆడియోతో థామ్సన్ స్మార్ట్‌టీవీ QD-LED వచ్చేసింది.. 6 స్పీకర్లతో అత్యంత సరసమైన ధరకే..!

Thomson Smart TV : థామ్సన్ ఇండియా అత్యంత సరసమైన ధరకు 65-అంగుళాలు, 75-అంగుళాల స్క్రీన్లతో మినీ QD LED టీవీని లాంచ్ చేసింది.

Thomson TV

Thomson Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? భారత మార్కెట్లోకి థామ్సన్ ఇండియా నుంచి సరికొత్త స్మార్ట్‌టీవీ వచ్చేసింది. కొత్త మినీ QD LED టీవీని కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ టీవీ మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉంది.

పవర్‌ఫుల్ 108W ఆడియో సిస్టమ్‌ను కలిగి ఉంది. 6 స్పీకర్లతో అత్యంత సన్నని స్మార్ట్ టీవీ ఇదే. బ్యాక్ సైడ్ సౌండ్ క్వాలిటీని పెంచే సబ్‌ వూఫర్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 65 అంగుళాలు, 75 అంగుళాల రెండు పెద్ద సైజులలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ మినీ QD LED టీవీని కొనుగోలు చేయొచ్చు.

థామ్సన్ మినీ QD LED టీవీ ఇండియా ధర, లభ్యత :
TH75QDMini1022 పిలిచే 65-అంగుళాల మోడల్ ధర రూ.61,999 కాగా, భారీ 75-అంగుళాల మోడల్ TH75QDMini1044 ధర రూ.95,999కు లభిస్తోంది. ఈ ధరలు ఇతర బ్రాండ్ల నుంచి వచ్చిన మినీ QD LED టీవీల కన్నా చాలా తక్కువగా ఉన్నాయని థామ్సన్ పేర్కొంది.

Read Also : Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోందోచ్.. మీరు ఊహించిన ధర కన్నా తక్కువే..!

థామ్సన్ మినీ QD LED టీవీ స్పెసిఫికేషన్లు :
ఈ రెండు మోడళ్లు పవర్‌ఫుల్ 4K డిస్‌ప్లేతో వస్తాయి. కాంట్రాస్ట్ కోసం లోకల్ డిమ్మింగ్, కలర్లు మరింత పవర్‌ఫుల్ హైడైనమిక్ రేంజ్ (HDR) కంటెంట్‌కు సపోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీలు బెజెల్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. స్ట్రాంగ్ మెటల్ బేస్‌ను కలిగి ఉంటాయి. అదనంగా, 1500 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తాయి. ఈ స్మార్ట్‌టీవీలు గూగుల్ ఆండ్రాయిడ్ సిస్టమ్‌లో రన్ అవుతాయి.

మీడియాటెక్ ప్రాసెసర్‌ను 16GB స్టోరేజ్, 2GB ర్యామ్ కలిగి ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లతో ప్రీలోడ్ అయ్యాయి. క్విక్ యాక్సెస్ కోసం రిమోట్‌లో స్పెషల్ బటన్‌లను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్‌లను కలిగి ఉంటాయి.

సౌండ్ ఎక్స్‌పీరియన్స్ :
థామ్సన్ మినీ QD LED టీవీలు రెండు పవర్‌ఫుల్ సబ్ వూఫర్‌లతో సహా 6 స్పీకర్లతో వస్తాయి. సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ టీవీలు డాల్బీ అట్మోస్ అడ్వాన్స్ ఆడియో ఫార్మాట్‌లకు సపోర్టు ఇస్తాయి. USB, HDMI వంటి వివిధ పోర్ట్‌లతో కూడా అందుబాటులో ఉన్నాయి.