iPhone
iPhone: ఐఫోన్ కొనాలంటే చాలా ఖర్చుపెట్టాలి. దీంతో కొత్తదాని కంటే రిఫర్బిష్డ్ లేదా వాడిన ఐఫోన్ కొనడం మంచిదని ఇప్పుడు చాలా మంది భావిస్తున్నారు. ఇవి తక్కువ ధరలకు హై ఎండ్ ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. అయితే, వాడిన ఐఫోన్‌ను కొనుగోలు చేసేముందు పలు విషయాలు చెక్ చేసుకోవాలి. లేదంటే డబ్బు నష్టపోతారు.
వాడిన ఐఫోన్లను ఆన్‌లైన్‌లో బాగా అమ్ముతుంటారు. వాటిలో చాలావరకు మోసపూరితమైనవే ఉంటాయి. ఎప్పుడూ అమెజాన్, బెస్ట్‌బై వంటి నమ్మకమైన వెబ్‌సైట్లను లేదా ఆపిల్ ఆమోదించిన రిఫర్బిష్డ్ ఉత్పత్తులను మాత్రమే కొనాలి. కొనుగోలు చేసే ముందు కస్టమర్ రివ్యూలు, రిటర్న్ షరతులు తప్పనిసరిగా చదవాలి. చాలా తక్కువ ధరలో వచ్చే ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. (iPhone)
Also Read: దీపావళి వేళ బంగారం ధరలు తగ్గుతాయా? నిపుణులు ఏమంటున్నారంటే? కొనాలనుకుంటున్నారా?
వాడిన ఐఫోన్లలో చాలావరకు పాత బ్యాటరీలు ఉంటాయి. ఇవి తక్కువ బ్యాటరీ లైఫ్‌తో పనిచేస్తాయి. ఆపిల్ సర్టిఫైడ్ రిఫర్బిష్డ్ ఐఫోన్లలో కొత్త బ్యాటరీ, కొత్త ఔట్‌సైడ్ కేస్‌తో పాటు ఒక సంవత్సరం లేదా ఆరు నెలల వారంటీ ఉంటుంది. ఇతర డీలర్ల పాలసీలపై ఇది ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆఫర్ చేసేముందు బ్యాటరీ పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలి.
అన్ని ఈ-కామర్స్ సైట్లు వాడిన ఫోన్ల స్థితిని గుర్తించడానికి గ్రేడింగ్ సిస్టమ్ (A, B, C) ఉపయోగిస్తాయి. A గ్రేడ్ ఫోన్ దాదాపు కొత్తలా ఉంటుంది, C గ్రేడ్ ఫోన్ ఎక్కువగా వాడినట్టుగా ఉంటుంది. మంచి డీల్ పొందడానికి గ్రేడింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
మీరు కొనుగోలు చేసే ఐఫోన్ చాలా పాతది కాకుండా చూసుకోవాలి. సాధారణంగా 3 జనరేషన్ల కంటే పాత ఐఫోన్ కొనవద్దు. 5 లేదా 6 సంవత్సరాల పాత ఐఫోన్లలో యాప్‌లు, సెక్యూరిటీ ఫీచర్లు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే అవి iOS అప్‌డేట్స్ పొందవు.
ఐఫోన్లలో లిక్విడ్ కాంటాక్ట్ ఇండికేటర్ (LCI) ఉంటుంది. ఇది సాధారణంగా సిమ్ ట్రేలో కనిపిస్తుంది. అది ఎరుపు రంగులో ఉంటే ఫోన్ నీటిలో మునిగినట్టు అర్థం. వెండి లేదా తెలుపు రంగులో ఉంటే ఫోన్ సురక్షితం. ఆర్డర్ చేసే ముందు దీన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.