Top 10 apps iPhone users in India spent most on in 2023
2023 Most Used 10 Apps : 2023 సంవత్సరం మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో కంపెనీలు అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లు తమ సర్వీసుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఆపిల్ కూడా 2023లో అత్యంత జనాదరణ పొందిన యాప్‌లు, గేమ్‌ల జాబితాను వెల్లడించింది. 2023లో ఐఫోన్ యూజర్లు వాడిన అత్యంత పాపులర్ 10 ఫ్రీ యాప్‌లను జాబితా రివీల్ చేసింది. అందులో టాప్ 10 యాప్స్ ఏంటో ఓసారి లుక్కేయండి.
Read Also : Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!
వాట్సాప్ మెసేంజర్ : ఆపిల్ ఐఫోన్‌లో అత్యంత పాపులర్ యాప్ ఇదే. యూజర్లు ఎక్కువగా వినియోగించారు. సాధారణంగా వాట్సాప్ అనేది విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్. వినియోగదారులు టెక్స్ట్ మెసేజ్‌లను పంపడానికి, వాయిస్, వీడియో కాల్‌లు చేసేందుకు, మీడియాను షేర్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది. ప్రైవసీ విషయానికి వస్తే.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ : రీల్స్, స్టోరీలను వీక్షించారు :
ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసేందుకు అద్భుతమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇది. వినియోగదారులు ఇతరుల నుంచి కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఐఫోన్ యూజర్లు తమ మెమెరీలను పోస్ట్ చేయడం, ఇష్టాలు, వ్యాఖ్యలు, డైరెక్ట్ మెసేజ్‌ల ద్వారా విభిన్న కమ్యూనిటీతో చాటింగ్ చేయడం వంటి పనులు ఎక్కువగా చేశారు.
యూట్యూబ్ : ఐఫోన్‌లో మూడో అత్యంత పాపులర్ యాప్ :
2023లో యూట్యూబ్ అనేది వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఐఫోన్ వినియోగదారులకు ప్రయోజనకరంగా మారింది. అత్యధికంగా వీడియోలను వీక్షించారు. మ్యూజిక్, ట్యుటోరియల్‌ల నుంచి వ్లాగ్‌లు, డాక్యుమెంటరీల వరకు విభిన్నమైన వాటిని ఇప్పటికి అందిస్తూనే ఉంది.
జియోసినిమా: క్రికెట్, టీవీ షోలు :
జియోసినిమాలో ఐఫోన్ యూజర్లు వివిధ రకాల సినిమాలు, టీవీ షోలు, ప్రత్యేకమైన కంటెంట్‌ను వీక్షించారు. భారతీయ ఐఫోన్ యూజర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను మాత్రం అధికమొత్తంలో వీక్షించారు.
గూగుల్ సెర్చ్ సహా మరిన్ని సర్వీసులు :
గూగుల్ యాప్ వివిధ గూగుల్ సర్వీసులకు గేట్‌వేగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో వాతావరణ అప్‌డేట్స్, వార్తలు, ఇతర కేటగిరీల సమాచారం కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు. గూగుల్ సహా ఇతర కార్యకలాపాలకు సంబంధించి అనేక అంశాలపై ఎక్కువగా సెర్చ్ చేశారు.
Top 10 apps 2023
స్నాప్‌చాట్ : ఇప్పటికీ అదే జోరు..
స్నాప్‌చాట్ అనేది కంటెంట్ క్రియేట్ చేసే మల్టీమీడియా మెసేజింగ్ యాప్. వినియోగదారులు ఫొటోలు, వీడియోలను పంపవచ్చు. క్రియేటివిటీ ఫిల్టర్‌లు, ప్రభావాలను పొందవచ్చు. రియల్ టైమ్ స్నేహితులతో మధురమైన క్షణాలను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ఇదే జోరు కొనసాగుతోంది.
గూగుల్ పే : నగదు చెల్లింపులు
2023లో ఐఫోన్ యూజర్లు భారత్‌లో గూగుల్ పేలో డిజిటల్ చెల్లింపులు, నగదు ట్రాన్స్‌ఫర్, బిల్లు చెల్లింపులను సులభతరం చేస్తుంది. లావాదేవీలు చేయడానికి సురక్షితమైన, అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది.
జీమెయిల్ : ఎక్కువగా వాడింది ఇదే..
2023లో జీమెయిల్ అనేది గూగుల్ ద్వారా అత్యధికంగా ఉపయోగించిన ఇమెయిల్ సర్వీసు. ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, సమర్థవంతమైన ఇమెయిల్ సంస్థ ఫీచర్లు, స్పామ్ ఫిల్టరింగ్‌ను అందిస్తుంది.
గూగుల్ క్రోమ్ : ప్రపంచంలో అత్యంత పాపులర్ బ్రౌజర్
గూగుల్ క్రోమ్ విస్తృతంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌గా చెప్పవచ్చు. అన్ని బ్రౌజర్లలో కన్నా క్రోమ్ ముందు వరుసలో ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఆపిల్ ఐఫోన్ యూజర్లు ఎక్కువగా వాడిన యాప్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.
ఫేస్‌బుక్ : వాడకం ఇంకా పెరిగింది..
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ ఇప్పటికీ కూడా చాలా మంది ఐఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్ అత్యధిక వినియోగంతో చార్ట్-టాపర్‌గా కొనసాగుతోంది.
Read Also : Apple iPhones Discount : ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!