Top 5 Apple iPhones : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? టాప్ 5 ఐఫోన్ మోడల్స్ మీకోసం.. మీ బడ్జెట్‌‌లో నచ్చిన ఐఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!

Top 5 Apple iPhones : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ప్రస్తుతం టాప్ 5 ఆపిల్ ఐఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఐఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

Top 5 Apple iPhones

Top 5 Apple iPhones : ఆపిల్ కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఆపిల్ లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లతో ఆధిపత్యం చెలాయిస్తోంది.

మీరు 2025లో బెస్ట్ ఐఫోన్‌లను కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. అన్ని రకాల బడ్జెట్‌లు, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతమైన ఆప్షన్లతో ఉన్నాయి. ఖరీదైన ప్రో వెర్షన్‌ల నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ల వరకు ఈ ఏడాదిలో మీరు కొనుగోలు చేయగల టాప్ 5 ఐఫోన్‌లు మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఐఫోన్ కొనుగోలు చేయండి.

Read Also : Oppo F29 Series Launch : కొత్త ఫోన్ కావాలా? ఒప్పో F29 సిరీస్ వచ్చేస్తోంది.. ఖతర్నాక్ ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ :
2025లో అత్యంత ప్రీమియం ఐఫోన్ ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఒకటి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఐఫోన్ ఇంటర్నల్‌గా ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8జీబీ ర్యామ్ కలిగి ఉంది.

అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ట్రిపుల్-కెమెరా సిస్టమ్ (48MP+48MP+12MP) కలిగి ఉంది. హై రిజల్యూషన్‌తో ఆకర్షణీయమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. 4685mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ భారత మార్కెట్లో రూ.1,33,900కి కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో పర్ఫార్మెన్స్, ధర పరంగా అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో పాటు ఫ్లూయిడ్ యానిమేషన్ల కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమర్చి ఉంటుంది. ఆపిల్ A18 ప్రో చిప్, 8జీబీ ర్యామ్ కలిగి ఉంది.

ఈ ఐఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. 48MP+48MP+12MP ట్రిపుల్-కెమెరా సెటప్ ఆకట్టుకునేలా ఫొటో పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 3582mAh ఫాస్ట్-ఛార్జింగ్ బ్యాటరీతో రోజంతా ఛార్జ్ వస్తుంది. ఈ ఐఫోన్ 16 ప్రో ధర రూ.1,10,900 నుంచి అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 16 :
తక్కువ ధరకు హై-ఎండ్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 బెస్ట్ ఆప్షన్. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా (XDR) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఐఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8GB ర్యామ్ కలిగి ఉంది. 48MP + 12MP డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హైక్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. 3561mAh బ్యాటరీ క్విక్ రీఫిల్లింగ్ కోసం ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఐఫోన్ 16 ధర రూ.72,900కు లభ్యమవుతుంది.

ఆపిల్ ఐఫోన్ 16e :
2025లో ఐఫోన్ 16E అద్భుతమైన మోడల్. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆపిల్ A18 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ సపోర్టుతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఐఫోన్ బ్యాక్ సైడ్ సింగిల్ 48MP కెమెరా, ఫొటోల కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాతో వస్తుంది. USB టైప్-C పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3961mAh బ్యాటరీని కలిగి ఉంది. 256GB స్టోరేజ్ మోడల్ రూ.69,900కి కొనుగోలు చేయొచ్చు.

Read Also : Amazon ASUS Days Sale : అమెజాన్‌లో అసూస్ డేస్ సేల్ ఆఫర్లు.. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

ఆపిల్ ఐఫోన్ 13 :
ఈ పాత మోడల్ ఐఫోన్ 13 బడ్జెట్ ప్రీమియం విభాగంలో ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A15 బయోనిక్ చిప్, 4జీబీ ర్యామ్ ద్వారా ఆధారితమైనది. రోజువారీ వినియోగానికి సిల్కీ స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

12MP + 12MP డ్యూయల్-కెమెరా కాన్ఫిగరేషన్ అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. 3227mAh బ్యాటరీ లైట్నింగ్ పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఐఫోన్ 13 అత్యంత చౌకైనది. కేవలం రూ.44,999కి కొనుగోలు చేయొచ్చు.